iPhone 15 Battery Option : ఐఫోన్ 15లో కొత్త బ్యాటరీ ఫీచర్.. మీ ఐఫోన్ బ్యాటరీని 80శాతం కన్నా ఛార్జ్ చేయలేరు.. ఎందుకో తెలుసా?

iPhone 15 Battery Option : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో కొత్త బ్యాటరీ సెట్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. మీ ఐఫోన్ బ్యాటరీని ఛార్జింగ్ పెడితే.. 80 శాతం కన్నా ఎక్కువ ఛార్జింగ్ చేయడం కుదరదు.. అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

iPhone 15 Battery Option : ఐఫోన్ 15లో కొత్త బ్యాటరీ ఫీచర్.. మీ ఐఫోన్ బ్యాటరీని 80శాతం కన్నా ఛార్జ్ చేయలేరు.. ఎందుకో తెలుసా?

iPhone 15 Brings New Battery Settings Option to Limit Charging Beyond 80 Percent

iPhone 15 Battery Option : ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ విషయం తప్పక తెలుసుకోండి.. ఆపిల్ సొంత బ్రాండ్ ఐఫోన్ 15 సిరీస్‌లో కొత్త బ్యాటరీ ఆప్షన్ ఫీచర్ తీసుకొచ్చింది. డిజైన్, స్పెసిఫికేషన్‌లలో గణనీయమైన అప్‌గ్రేడ్‌లతో iPhone 15 సిరీస్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 15 నుంచి ఐఫోన్ మోడల్‌లలో లైటనింగ్ పోర్ట్ బదులుగా USB టైప్-C పోర్టు తీసుకొచ్చింది. కుపెర్టినో ఆధారిత కంపెనీ లేటెస్ట్ లైనప్ కొత్త బ్యాటరీ సెట్టింగ్‌లను ఉపయోగిస్తోంది.

ఈ ఫీచర్‌తో iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Pro Max వినియోగదారులు బ్యాటరీ లైఫ్ పెంచడానికి బ్యాటరీ ఛార్జ్ శాతాన్ని లిమిట్ చేసింది. ఈ సెట్టింగ్ గరిష్ట బ్యాటరీ ఛార్జ్ స్థాయిని 100 శాతానికి చేరుకోకుండా 80 శాతానికి తగ్గించడం ద్వారా బ్యాటరీ హెల్త్ మరింత పెంచుతుంది. అదనంగా, ఆపిల్ యూజర్ల కోసం బ్యాటరీ హెల్త్ గురించి మరిన్ని వివరాలను అందిస్తోంది.

ఐఫోన్ బ్యాటరీ కొత్త ఆప్షన్ ఎనేబుల్ ఇలా :
iOS 17లో రన్ అయ్యే అన్ని iPhone 15, iPhone 15 Pro మోడల్‌లు బ్యాటరీ హెల్త్ & ఛార్జింగ్ మెనులో కొత్త ఆప్షన్ కలిగి ఉన్నాయి. ఈ కొత్త ఫీచర్ ఎనేబుల్ చేయడం ద్వారా హ్యాండ్‌సెట్ 80 శాతానికి మించి ఛార్జింగ్ చేయకుండా ఆపుతుంది. ఈ మెనూలో 3 ఆప్షన్లు ఉన్నాయి. ఆప్టిమైజ్ చేసిన బ్యాటరీ ఛార్జింగ్, 80 శాతం పరిమితి ఉంది. Settings > Battery > Battery Health & Charging ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు.

iPhone 15 Brings New Battery Settings Option to Limit Charging Beyond 80 Percent

iPhone 15 Brings New Battery Settings Option to Limit Charging Beyond 80 Percent

80శాతం లిమిట్ దాటగానే.. :
కొత్త 80 శాతం లిమిట్ ఆప్షన్ మీ iPhone 15 మోడల్‌లు పూర్తి సామర్థ్యంలో 80 శాతానికి చేరుకున్నప్పుడు ఛార్జింగ్ ఆపివేస్తుంది. ఈ కొత్త ఫీచర్ గతంలో iOS 17 బీటా కోడ్‌లో అందుబాటులో ఉంది. అదనంగా, ఆపిల్ తమ డివైజ్ బ్యాటరీ సైకిల్ కౌంట్‌ను మొదటిసారి చెక్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. టిప్‌స్టర్ రెవెగ్నస్ సూచించినట్లుగా.. ఐఫోన్ 15 వినియోగదారులు తమ హ్యాండ్‌సెట్‌లో Settings > General> గురించి అనే క్యాప్షన్ ద్వారా బ్యాటరీ తయారీ తేదీ, ప్రారంభ వినియోగ సమయం, బ్యాటరీ సైకిల్ కౌంట్, మరిన్ని వివరాలను ఇప్పుడు పొందవచ్చు.

ఆపిల్ కంపెనీ ఐఫోన్ బ్యాటరీ వేడెక్కడం నుంచి బ్యాటరీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దీర్ఘకాలం బ్యాటరీ హెల్త్ పొందడానికి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయడాన్ని సిఫార్సు చేసింది. ఎందుకంటే.. చివరి 20 శాతం ఎక్కువ పవర్ తీసుకుంటుంది. ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కాలక్రమేణా బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడుతుందని భావిస్తున్నారు. ఆపిల్ ఇప్పటికే పాత ఐఫోన్ మోడళ్లలో అందిస్తున్న ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ సెట్టింగ్‌కు దాదాపు సమానంగా ఉంటుంది. రాత్రిపూట బ్యాటరీ ఛార్జింగ్‌ను పరిమితం చేస్తుంది. శాంసంగ్, వన్‌ప్లస్ కూడా తమ హ్యాండ్‌సెట్‌లతో ఇలాంటి ఫీచర్లను అందిస్తున్నాయి.

Read Also : Vivo V29 Series Launch : వివో V29 సిరీస్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?