రోడ్డున పడుతున్నారు : Ola Cabs బ్యాడ్ న్యూస్

  • Published By: madhu ,Published On : May 21, 2020 / 07:17 AM IST
రోడ్డున పడుతున్నారు : Ola Cabs బ్యాడ్ న్యూస్

కరోనా ఎఫెక్ట్ సర్వీస్ సెక్టార్‌పై తీవ్రంగా పడుతోంది..ఇప్పటికే ఫుడ్ ఆగ్రిగేటర్లను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం ఇప్పుడు క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్లనూ కమ్మేసింది. దీంతో ఓలా క్యాబ్ సర్వీసెస్ దేశంలో 1400మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా ప్రభావం భారత్‌లోని సర్వీస్ రంగంలో తీవ్రంగా పడుతోంది..దీంతో ఈ రంగంలో ఉపాధి పొందుతున్న వేలాదిమంది రోడ్డున పడుతున్నారు..తాజాగా ఓలా రైడ్స్ తన అన్ని విభాగాలను కలిపి 1400మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత రెండు నెలల్లో ఆదాయం 95 శాతం క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ 1400 మందికి ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపినట్లు ఓలా సీఈఓ భవష్ అగర్వాల్ తెలిపారు. తొలగించబడే ఉద్యోగులకు మూడు నెలల వేతనం ఇవ్వడంతోపాటు..ఏడాది చివరి వరకూ మెడికల్ క్లెయిన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు వర్తిస్తాయని ఓలా ప్రకటించింది.

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభం కారణంగా భారత్ అంతటా రవాణారంగం స్తంభించిపోయింది..దీని ప్రభావం తమ సంస్థపైనా తీవ్రంగా పడిందని ఓలా చెప్తోంది..లక్షలాదిమంది డ్రైవర్లు..జీవనోపాధి కోల్పోయారని ఓలా సీఈఓ ఆవేదన వ్యక్తం చేసారు..ఇప్పటికే మరో ప్రముఖ క్యాబ్ ఆగ్రిగేటర్ ఉబెర్ కూడా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది..దీంతో లక్షలాది మందికి ఆర్థికంగా సాయపడుతున్న ఈ రెండు సంస్థల భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికిప్పుడు ఉద్యోగాల తొలగింపుతోనే సరిపెట్టినా..లాక్ డౌన్ తర్వాత వీటికి ప్రజల ఆదరణ ఎలా ఉంటుందనేది సందేహంగా మారింది.

కరోనాకి ముందు ఎలాంటి జీవితం ఉండేదో..అలాంటి జీవనం మాత్రం ఇప్పట్లో సాధ్యంకాదనేది ఓలా కంపెనీ అంచనా..సోషల్ డిస్టెన్సింగ్ అవసరమైన పరిస్థితుల్లో ఇదివరకటిలా బుక్సింగ్, క్యాబ్ షేరింగ్స్ ఉండవనేది ఈ సంస్థల అంచనాగా కన్పిస్తోంది..అందుకే వీలైనంత ఖర్చులు తగ్గించుకునే పనిలో ఓలా,ఉబెర్ పడ్డాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఓలా విషయమే చూసుకుంటే..గత ఏడాది నుంచే ఉద్యోగులను తగ్గించుకుంటూ వస్తోంది..ఇప్పుడు లాక్‌డౌన్ తర్వాత పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకూ వేతనాల్లో భారీగా కోత విధించారు. శానిఫ్రాన్సిస్కోకి చెందిన ఉబెర్..వివిధ దేశాల్లోని తమ సంస్థకి చెందిన ఉద్యోగులను తొలగించడం ప్రారంభమైంది..

మే నెల ప్రారంభంలోనే ఉబెర్..3700మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మొదటి త్రైమాసికంలోనే ఉబెర్ సంస్థ తనకి దాదాపు 300కోట్ల డాలర్ల మేర నష్టం వచ్చినట్లు ప్రకటించింది. మార్చి 25 నుంచి నిలిచిపోయిన క్యాబ్ అగ్రిగేటర్ల సర్వీసులు నాలుగో విడత లాక్‌డౌన్ తర్వాతే కాస్త రోడ్డెక్కడం ప్రారంభించాయ్..ఉబెర్ సర్వీసులు 40 నగరాల్లో..ఓలా సర్వీసులు 160 సిటీల్లో ప్రారంభమయ్యాయ్. ఐతే కరోనా విశ్వరూపం దాల్చడంతో సడలింపులతోనైనా ఆర్థికంగా ఊరట దక్కేట్లు కన్పించడం లేదని ఈ సంస్థలు భావిస్తున్నాయ్. అందుకే వీలైనంతగా ఖర్చులు తగ్గించుకుంటూ ఉద్యోగాలకు ఉద్వాసన పలుకుతున్నాయి. 

Read: TikTok Ownerకు బిలియన్ డాలర్ల ఆదాయం