లిమిటెడ్ ఆఫర్ : OnePlus ఫోన్, TVలపై భారీ డిస్కౌంట్లు

  • Published By: sreehari ,Published On : November 25, 2019 / 10:46 AM IST
లిమిటెడ్ ఆఫర్ : OnePlus ఫోన్, TVలపై భారీ డిస్కౌంట్లు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్, వన్ ప్లస్ కంపెనీ తమ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాతో కలిసి వన్ ప్లస్ టెక్నాలజీ సంయుక్తంగా స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలపై బిగ్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి.

అమెజాన్ ఐదో వార్షికోత్సవం సందర్భంగా వన్ ప్లస్ ప్రొడక్టులపై అమెజాన్ ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం.. అమెజాన్ ఇండియా వెబ్ సైట్లో.. వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లపై రూ.5వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. డిసెంబర్ 2 వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ తో వన్ ప్లస్ ప్రో ధర రూ.44వేల 999 నుంచి రూ.39వేల 999కి తగ్గింది. 

OnePlus 7Pro స్మార్ట్ ఫోన్.. 6GB ర్యామ్, 128GB స్టోరేజీతో వచ్చింది. ఒరిజినల్ ధర రూ.48వేల 999లతో మార్కెట్లో లాంచ్ అయింది. కానీ, వన్ ప్లస్ 7T సిరీస్ వచ్చాక దీని ధర రూ.44వేల999కి తగ్గింది. మరోవైపు వన్ ప్లస్ 7 ప్రోలో మరో వేరియంట్ (8GB RAM) ఒరిజినల్ ధర రూ.52వేల 999గా ఉండగా అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్ ధరతో రూ.42వేల 999కు చేరింది. OnePlus 7T స్మార్ట్ ఫోన్ ఒరిజినల్ ధర రూ.37వేలు ఉంటే.. డిస్కౌంట్ ధరతో రూ.34వేలకు చేరింది. 

HDFC బ్యాంకు కస్టమర్లకు OnePlus ఫోన్లపై అదనంగా డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. వన్ ప్లస్ ఫోన్ కొనుగోలుపై HDFC కస్టమర్లకు ఫ్లాట్ రూ.1,500, రూ.2వేలు వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. వన్ ప్లస్ 7 ప్రో, వన్ ప్లస్ 7టీ కొనుగోలుపై అమెజాన్ కూడా 6 నెలలపై నో కాస్ట్ EMI ఆఫర్ చేస్తోంది.  

మరోవైపు, వన్ ప్లస్ తమ స్మార్ట్ టీవీలపై కూడా డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. Q1టీవీ ధర రూ.69వేల 899గా ఉండగా, Q1 టీవీ ప్రో ధర రూ.99వేల 899 డిస్కౌంట్ అందిస్తోంది. HDFC బ్యాంకు క్రెడిట్, డెబిల్ కార్డు యూజర్లు OnePlus Q1 టీవీ కొనుగోలుపై రూ.4వేల వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అలాగే Q1 ప్రో టీవీలపై రూ.5వేల వరకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.