OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ OnePlus భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. OnePlus TV 50-అంగుళాల Y1S ప్రోని 4K డిస్‌ప్లేతో కొత్త స్మార్ట్ టీవీగా ప్రవేశపెట్టింది.

OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

Oneplus Tv 50 Inch Y1s Pro Launched In India (2)

OnePlus Y1S Pro : ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ OnePlus భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. OnePlus TV 50-అంగుళాల Y1S ప్రోని 4K డిస్‌ప్లేతో కొత్త స్మార్ట్ టీవీగా ప్రవేశపెట్టింది. OnePlus TV Y1S Pro అనే ఈ స్మార్ట్ టీవీ 50-అంగుళాల డిస్‌ప్లేతో వచ్చింది. OnePlus TV 50-అంగుళాల Y1S Pro స్మార్ట్ టీవీ.. 43-అంగుళాల వేరియంట్ తర్వాత Y1S Pro సిరీస్‌లో రెండవ స్మార్ట్ టీవీగా మార్కెట్లోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్.. భారీ 50-అంగుళాల డిస్‌ప్లే కాకుండా, 4K UHD డిస్‌ప్లే, ఆటో లో లాటెన్సీ మోడ్ (ALLM), MEMCతో గామా ఇంజిన్‌తో వస్తుంది. అయితే.. OnePlus TV 50-అంగుళాల Y1S Pro ధర, ఫీచర్లు వంటి వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

TV Y1S Pro ఇండియా ధర, ఫీచర్లు
OnePlus TV 50-అంగుళాల Y1S Pro అప్‌గ్రేడ్ 4K UHD డిస్‌ప్లేతో వచ్చింది. 50-అంగుళాల ప్యానెల్ 10-బిట్ కలర్ డెప్త్ ఫీచర్‌తో బిలియన్ కంటే ఎక్కువ కలర్లకు సపోర్టు ఇస్తుంది. HDR10+, HDR10, అలాగే HLG ఫార్మాట్‌కు సపోర్టుతో వస్తుంది. OnePlus గామా ఇంజిన్ ఫీచర్.. పవర్ ఫుల్ కలర్స్, డైనమిక్ కాంట్రాస్ట్‌ను అందిస్తుంది. 50-అంగుళాల Y1S Proకి దారి తీస్తుంది. అదనంగా, MEMC టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. మొత్తం 24W అవుట్‌పుట్‌తో రెండు స్పీకర్లను కలిగి ఉంది. గేమ్‌లు ఆడుతున్నప్పుడు స్మార్ట్ టీవీ ఆటో లో లేటెన్సీ మోడ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. స్మార్ట్ టీవీ అనుభవంలో భాగంగా మల్టీకాస్ట్, గూగుల్ డ్యుయో సపోర్ట్‌ కూడా ఉంది.

Oneplus Tv 50 Inch Y1s Pro Launched In India (1)

Oneplus Tv 50 Inch Y1s Pro Launched In India

OnePlus కొత్త స్మార్ట్ టీవీ కిడ్స్ మోడ్‌తో వస్తుంది. ఏజ్ తగిన కంటెంట్ ఉంటుంది. ఆరోగ్యకరమైన డిజిటల్ లైఫ్ కోసం తల్లిదండ్రులు నిర్దిష్ట “watch Time Limitation ఫీచర్‌తో View Hours కూడా నియంత్రించవచ్చు. యూజర్లు ఇతర ఫీచర్లను ఉపయోగించేందుకు ఇతర OnePlus డివైజ్‌లను కూడా కనెక్ట్ చేయవచ్చు. కొత్త OnePlus టీవీలు OnePlus బడ్స్‌ని ఓపెన్ చేయగానే కనెక్షన్ రిక్వెస్ట్ ప్రాంప్ట్ చేస్తాయి. టీవీని ఆన్ ఆఫ్ చేయడానికి యూజర్లు తమ OnePlus వాచ్‌ని OnePlus TV 50 Y1S ప్రోకి లింక్ చేయవచ్చు. యూజర్ నిద్రలోకి జారుకున్నట్లు OnePlus వాచ్.. స్మార్ట్ స్లీప్ కంట్రోల్ ఫీచర్ వెంటనే OnePlus TVని స్విచ్ ఆఫ్ చేస్తుంది.

OnePlus TV Y1S ప్రో ధర ఎంతంటే? :
OnePlus TV 50-అంగుళాల Y1S ప్రో ధర రూ. 32,999. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లలో జులై 7 నుంచి అందుబాటలో ఉండనుంది. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా.. యాక్సిస్ బ్యాంక్ కస్టమర్‌లు కొత్త వన్‌ప్లస్ టీవీలను కొనుగోలు చేసిన తర్వాత రూ. 3,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. Amazonలో ప్రైవరీ బ్యాంకు లావాదేవీల కోసం 9 నెలల నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. Amazon.inలో కొత్త OnePlus TVని కొనుగోలు చేసిన తర్వాత Amazon కస్టమర్లు12 నెలల పాటు కాంప్లిమెంటరీ Amazon Prime సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు.

Read Also : OnePlus 10T 5G : వన్‌ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?