Onion prices : ఈ నెలాఖరు నాటికి కిలో ఉల్లి రూ.70.. క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ హెచ్చరిక

దేశంలో ఉల్లి ధరలు కూడా టమాటా ధరల బాట పట్టనున్నాయా? అంటే అవునంటోంది క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్. ఈ నెలాఖరు నాటికి దేశంలో ఉల్లి ధరలు కిలో 70రూపాయలకు చేరవచ్చని క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది....

Onion prices : ఈ నెలాఖరు నాటికి కిలో ఉల్లి రూ.70.. క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ హెచ్చరిక

Onion prices

Onion prices rise : దేశంలో ఉల్లి ధరలు కూడా టమాటా ధరల బాట పట్టనున్నాయా? అంటే అవునంటోంది క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్. ఈ నెలాఖరు నాటికి దేశంలో ఉల్లి ధరలు కిలో 70రూపాయలకు చేరవచ్చని క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. (Onion prices might touch Rs. 70 per kg) ఇప్పటికే టమాటా ధరలు ఆకాశన్నంటడంతో అవస్థలు పడుతున్న ప్రజలకు మూలిగే నక్కపై తాటి పండు పడ్డ చందంగా ఉల్లి ధరలు పెరుగుతాయని క్రిసిల్ తన నివేదికలో వెల్లడించింది. (Crisil Report)

Manipur : మణిపుర్‌లో మళ్లీ హింసాకాండ…ముగ్గురి మృతి, ఇళ్లు దహనం

దేశంలో రబీ పంట ఉల్లి నిల్వ కాలం రెండు నెలల పాటు తగ్గాయి. దీంతో ఉల్లి నిల్వలు తగ్గుతాయని, దీంతో ఈ నెలాఖరు నుంచి వీటి ధరలు గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయని క్రిసిల్ హెచ్చరించింది. ఉల్లి నిల్వలు తగ్గినపుడు కిలో ధర 60 నుంచి 70 రూపాయల వరకు పెరిగే అవకాశముందని క్రిసిల్ తెలిపింది. (by month end) ధర లేకపోవడంతో దేశంలోఉల్లి సాగు విస్తీర్ణం గతంలో కంటే 8 శాతం మేర తగ్గింది.

Naxal hotbed Sukma : నక్సల్స్ ఖిల్లా నుంచి యూకేకు…రియా ఫిలిప్ విజయగాథ

ప్రస్తుతం డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ డేటా ప్రకారం ఢిల్లీ మార్కెట్‌లలో ఉల్లిపాయల రిటైల్ ధర కిలోకు రూ.30 ఉంది. క్రిసిల్ నివేదిక నిజమైతే ఈ నెలాఖరు నాటికి ఉల్లి ధరలు రెట్టింపు కావచ్చు. ఖరీఫ్ పంట అక్టోబరు నుంచి మార్కెట్ లో వస్తోందని, అప్పుడు ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. 2020 వ సంవత్సరంలో ఉల్లి ధరలు గరిష్ఠానికి దిగువనే ఉన్నాయి.

Jammu And Kashmir : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్, ముగ్గురు సైనికుల మృతి

గతంలో ఉల్లి, బంగాళాదుంపల ధరలు పడిపోవడంతో మార్కెట్లను స్థిరీకరించేందుకు నాఫెడ్ జోక్యం చేసుకుంది. ఖరీఫ్ ఉల్లి పంట మార్పిడి, దీని దిగుబడి నిర్ణయించడంలో ఆగస్టు, సెప్టెంబర్‌లలో కురిసిన వర్షపాతం కీలక పాత్ర పోషిస్తుందని నివేదిక హెచ్చరించింది. సెప్టెంబర్‌లో ఉన్న అధిక ధరలతో పోలిస్తే, పండుగ నెలలైన అక్టోబర్-డిసెంబరులో ధరల హెచ్చుతగ్గులు స్థిరంగా ఉంటాయని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. ఇంకెందుకు ఆలస్యం…ధరలు పెరగనున్న నేపథ్యంలో వినియోగదారులు పారాహుషార్… ఉల్లి కొని ఇళ్లలో నిల్వ ఉంచుకోండని నిపుణులు సూచిస్తున్నారు.