Popcorn ధరలు పెరుగుతున్నాయ్ : 18 శాతం GST

  • Published By: madhu ,Published On : June 26, 2020 / 06:05 AM IST
Popcorn ధరలు పెరుగుతున్నాయ్ : 18 శాతం GST

టైం పాస్ కోసం ఏవో ఏవో తింటుంటాం. అందులో ఎన్నో రకాల ఆహార పదార్థాలుంటాయి. కానీ..Popcorn స్థానం దానిదే. చాలా మంది దీనిని తినడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇంట్లో ఉన్న సమయంలో లేదా థియేటర్ లో సినిమా చూస్తూ..టైం పాస్ కోసం వీటిని నములుతుంటారు.

రెడీ ఈట్ పాప్ కార్న్ మార్కెట్ లో లభ్యం అవుతున్న సంగతి తెలిసిందే. గిన్నెలో వీటిని వేసి..హీట్ చేసి వేడి వేడిగా తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అయితే..ఇప్పుడున్న ధరలు ఇక ఉండవు. ఎందుకంటే Popcorn రేట్లు పెరగనున్నాయి. దీనికి కారణం…జీఎస్టీలో చేరడమే.

మొన్నటి వరకు 5 శాతం GST శ్లాబ్ లో ఉన్న పాప్ కార్న్ ఇప్పుడు 18 శాతం రేట్ల శ్లాబ్ లోకి చేరిపోయింది. రెడీ టూ ఈట్ పాప్ కార్న్ పై 18 శాతం జీఎస్టీ విధిస్తామని గుజరాత్ GST అడ్వాన్స్ రూలింగ్స్ (AAR) అథార్టీ స్పష్టం చేసింది. 

సూరత్ కు చెందిన జలరాం ఎంటర్ ప్రైజెస్ సంస్థ ఈ Popcorn ఉత్పత్తి చేస్తోంది. జీఎస్టీ స్పష్టత కోసం సంస్థ యజమాని బలరాం…ఏఏఆర్ ను సంప్రదించగా పై విషయాన్ని వెల్లడించారు. నూనె, పసుపు, సుగంధ ద్రవ్యాలు మొదలైన పదార్థాలతో తయారు చేసే ఉత్పత్తు అన్ని కూడా 5 శాతం కిందకే వస్తాయని Popcorn పై కూడా అలాగే వ్యవహరించాలని ఆయన కోరుతున్నారు.

రెడీ టూ ఈట్ పాప్‌కార్న్‌ను తృణధాన్యాలుగా పరిగణించలేమని వెల్లడించింది. రెడీ టూ ఈట్‌కు సంబంధించిన ప్యాక్డ్‌ నిల్వ ఆహార పదార్థాలన్నీ 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లోకే వస్తాయని AAR స్పష్టం చేసింది.

కొన్ని రోజుల క్రితం రెడీ టూ ఈట్ పరోటాను కూడా 18 శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చిన విషయం తెలిసిందే. చపాతీ, పరోటా వేర్వేరు అని.. చపాతీ రోటీ కిందకు రాదని కర్నాటక జీఎస్టీ అడ్వాన్స్ రూలింగ్స్ (AAR) అథారిటీ తెలిపింది. అది రెడీ టూ ఈట్ కిందకు వస్తుందని, అందుకే 18శాతం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Read: మంత్రి స్మృతిఇరానీ చేతి బంగారుగాజులు ప్రధానికి ఇచ్చి ఇంధన ధరలు తగ్గించమని చెప్పొచ్చుగా..అంటూ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు...