Google Warn Employees : గూగుల్ ఉద్యోగులకు హెచ్చరిక.. వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. లేదంటే జరిగేది ఇదే..!

Google Warn Employees : గూగుల్ వర్క్-ఫ్రమ్-ఆఫీస్ ( హైబ్రిడ్ వర్క్) పాలసీని అప్‌డేట్ చేసింది. కంపెనీలోని ఉద్యోగులు వారానికి 3 రోజులు ఆఫీసులకు రావడాన్ని తప్పనిసరి చేసింది. ఈ కొత్త విధానాలను పాటించడంలో విఫలమైన ఉద్యోగులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.

Google Warn Employees : గూగుల్ ఉద్యోగులకు హెచ్చరిక.. వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. లేదంటే జరిగేది ఇదే..!

Return to office 3 days a week or get poor performance reviews, Google warns employees

Google Warn Employees : వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులపై గూగుల్ (Google) కన్నెర్ర చేసింది. రెగ్యులర్‌గా ఆఫీసుకు రాని ఉద్యోగులపై గూగుల్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే సెర్చ్ ఇంజిన్ దిగ్గజం హైబ్రిడ్ వర్క్ పాలసీ (hybrid work policy)ని అప్‌డేట్ చేసింది. ఇప్పుడు గూగుల్ ఉద్యోగులు వారానికి కనీసం 3 రోజులైనా ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ఉద్యోగుల హాజరు కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది. ఈ కొత్త ఆదేశాలను పాటించడంలో విఫలమైన ఉద్యోగులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అలాంటి ఉద్యోగుల పర్ఫార్మెన్స్ రివ్యూల ఆధారంగా వారికి రావాల్సిన ప్రమోషన్స్‌పై ప్రభావం పడుతుందని గూగుల్ చెప్పకనే చెబుతోంది.

నివేదికల ప్రకారం.. గూగుల్ తమ ఉద్యోగుల పనితీరుపై రివ్యూ చేస్తోంది. అంతేకాదు.. ఎన్నిరోజులు ఆఫీసుకు వస్తున్నారు అనేదానిపై ఉద్యోగుల హాజరును తప్పనిసరి చేసింది. ఆఫీసుకు హాజరుకాని ఉద్యోగులకు పూర్ పర్ఫార్మెన్స్ రివ్యూలను ఇస్తోంది. గూగుల్ ఉద్యోగులు ఇప్పుడు వారానికి కనీసం 3 రోజులు భౌతికంగా ఆఫీసుకు హాజరు కావాలని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ మేరకు ఉద్యోగులకు గూగుల్ హెచ్‌ఆర్ నుంచి అధికారిక ఇమెయిల్‌ పంపుతున్నారట.. గూగుల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, ఫియోనా సిక్కోని, ఆఫీసులో ఉద్యోగుల హాజరును రెట్టింపు చేసే దిశగా చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఇందులో వ్యక్తిగతంగా ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని అన్నారు.

కంపెనీ పాలసీని ఉల్లంఘిస్తే కోతలే.. :
హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను పాటించని ఉద్యోగులపై గూగుల్ కఠిన చర్యలు చేపట్టనుంది. ఈ క్రమంలోనే గూగుల్ తమ ఉద్యోగులను వారానికి కనీసం 3 రోజులు ఆఫీసు నుంచి పని చేయమని కోరింది. ఇప్పుడు ఉద్యోగుల హాజరు బ్యాడ్జ్‌ను ట్రాక్ చేయడం ప్రారంభిస్తామని తెలిపింది. ఉద్యోగుల పనితీరు సమీక్షల సమయంలో వారికి తదనుగుణంగా రేట్ చేస్తామని కంపెనీ తెలిపింది. CNBC నివేదిక ప్రకారం.. గూగుల్ తన వర్క్ పాలసీని అప్‌డేట్ చేసింది. ఇందులో ఇప్పుడు ఆఫీసు బ్యాడ్జ్‌ల ద్వారా హాజరును ట్రాక్ చేయనుంది. తద్వారా ఆఫీసుకు రాని ఉద్యోగులకు రావాల్సిన ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి వాటిపై తీవ్ర ప్రభావం పడుతుందంటూ మెలిక పెట్టేసింది.

Read Also : Motorola Edge 40 Vs Realme 11 Pro+ : అత్యంత సరసమైన మోటో ఎడ్జ్ 40, రియల్‌మి 11ప్రో.. భారత్‌లో ధర ఎంత? ఫీచర్లలో ఏది బెటర్?

కంపెనీ నిబంధనలకు అనుగుణంగా హాజరు కావడంలో విఫలమైన ఉద్యోగులు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఉద్యోగుల పనితీరు సమీక్షలలో వారి హాజరు శాతం కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. గూగుల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, ఫియోనా సిక్కోని ఉద్యోగుల వ్యక్తిగత సహకారం ప్రాముఖ్యతను వివరించారు. రిమోట్ వర్క్ చేసే ఉద్యోగులు గూగుల్ ఆఫీసుకు సమీపంలో నివసిస్తుంటే.. హైబ్రిడ్ వర్క్ షెడ్యూల్‌కు వెంటనే మారాలని సూచించింది.

Return to office 3 days a week or get poor performance reviews, Google warns employees

Return to office 3 days a week or get poor performance reviews, Google warns employees

ఇప్పటికే రిమోట్ వర్క్ (వర్క్ ఫ్రమ్ హోం) చేసేందుకు అనుమతినిచ్చిన ఉద్యోగుల విషయంలో కూడా సాధ్యమైనంత తొందరగా ఒక నిర్ణయానికి రానున్నట్టు కంపెనీ పేర్కొంది. ప్రధానంగా.. వ్యాపార అవసరాలు, ఇతర రోల్స్, టీమ్స్, నిర్మాణాలు లేదా స్థానాల్లో మార్పులు వంటి అంశాల ఆధారంగా ఆఫీసుకు రావాలా? లేదా అనేది పున:సమీక్షించనున్నట్టు గూగుల్ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్‌లో ఉద్యోగుల బ్యాడ్జ్ డేటాను ఉపయోగించి ఆఫీసుల్లో హాజరు విధానానికి ఉద్యోగులు కట్టుబడి ఉండడాన్ని గూగుల్ పర్యవేక్షిస్తుంది. కంపెనీ కొత్త విధానాలను ఉల్లంఘించే ఉద్యోగులపై గూగుల్ హెచ్ఆర్ ద్వారా కఠిన చర్యలు చేపట్టనుంది.

ఏఐ రంగంలో పోటిపడేందుకే గూగుల్ చర్యలు :
హైబ్రిడ్ విధానంలో వ్యక్తిగత సహకారంతో కలిగే ప్రయోజనాలను ఇంటి నుంచి పని చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఒకచోట చేర్చడమే లక్ష్యంగా పెట్టుకుందని గూగుల్ ప్రతినిధి స్పష్టం చేశారు. రిమోట్ వర్క్ ప్లాన్‌లను సడలించిన తర్వాత ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి వచ్చేలా కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. గతంలో, గూగుల్ కచేరీలను నిర్వహించడం, మార్చింగ్ బ్యాండ్‌లను నియమించుకోవడంతో పాటు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు వచ్చేలా ప్రోత్సహించడానికి వివిధ వ్యూహాలను ప్రయత్నించింది.

మరోవైపు.. మైక్రోసాఫ్ట్, ఓపెన్‌ఏఐ (OpenAI) వంటి బలమైన పోటీదారులను ఎదుర్కొనే కృత్రిమ మేధస్సు రంగంలో పోటీపడేందుకు గూగుల్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగానే ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. కంపెనీకి సంబంధించిన లీక్‌లను నిరోధించడానికి తదుపరి చర్యలను చేపట్టింది. అయినప్పటికీ, విస్తృత వ్యయ-తగ్గింపు చర్యలలో భాగంగా గూగుల్ తన రియల్ ఎస్టేట్ ఉద్యోగాలను కూడా భారీగా తగ్గిస్తోంది. శాన్‌జోస్ క్యాంపస్‌లో నిర్మాణం నిలిపివేసింది. కంపెనీ అతిపెద్ద ప్రదేశాలలో ఒకటైన క్లౌడ్ యూనిట్‌లో ఉద్యోగులను డెస్క్-షేరింగ్ చేసుకోవాలని సూచించింది. మొత్తంమీద, ఈ పాలసీ అప్‌డేట్‌లతో గూగుల్ ఒక పక్క రిమోట్ వర్క్ బెనిఫిట్స్ గుర్తిస్తూనే, ఉద్యోగులను తిరిగి ఆఫీసుకు రావాలని కోరుతోంది.

Read Also : iPhone 13 Discount Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే కొనేసుకోండి.. డోంట్ మిస్..!