కస్టమర్లకు SBI ఝలక్ : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తగ్గిన వడ్డీ రేట్లు

  • Published By: veegamteam ,Published On : January 15, 2020 / 05:32 AM IST
కస్టమర్లకు SBI ఝలక్ : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తగ్గిన వడ్డీ రేట్లు

దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్ధ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఫిక్స్ డ్ డిపాజిట్(FD) వడ్డీ రేట్లను తగ్గించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త వడ్డీ రేట్లు జనవరి 10, 2020 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ తెలిపింది.

ఏడాది నుంచి పది సంవత్పరాలలోపు ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్ రేట్లపై 15 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్లను తగ్గించింది. 7 రోజుల నుంచి ఏడాది ఉన్న వడ్డీ రేట్లలో మార్పులు లేవు అని తెలిపింది. గతంలోను ఎస్బీఐ సంవత్సరం నుంచి 2 ఏళ్ళ లోపు వడ్డీ రేట్లపై 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 

ప్రస్తుతం FD వడ్డీ రేట్లు ఇవే..
7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్ డీ రేటు 4.50 శాతం ఇస్తుంది.
46 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్ డీ రేటు 5.50 శాతం ఇస్తుంది.
180 రోజుల నుంచి 210 రోజుల ఎఫ్ డీ రేటు 5.80 శాతం ఇస్తుంది.
211 రోజుల నుంచి ఏడాది లోపు ఎఫ్ డీ రేటు 5.80 శాతం ఇస్తుంది.
ఏడాది నుంచి 10 సంవత్సరాల లోపు ఎఫ్ డీ రేటు 6.10 శాతం ఇస్తుంది.  

సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ వడ్డీ రేట్లపై 50 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. సంవత్సరం నుంచి 10 సంవత్సరాలలోపు ఎఫ్ డీపై 6.60 శాతం వడ్డీ రేటు ఇస్తున్నట్లు తెలిపింది.

ఎస్బీఐ కొత్తగా రెసిడెన్షియల్ బిల్డర్ ఫైనాన్స్ విత్ బయ్యర్ గ్యారంటీ(RBBG) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద బిల్డర్ నిర్ణీత సమయం లోపు ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే ఇన్వెస్ట్ చేసిన డబ్బు మెుత్తాన్నితిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఎస్బీఐ హోమ్ ప్రాజెక్టులకు మాత్రం ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది.