ఈరోజు రాత్రి SBI డిజిటల్ సేవలు బంద్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) కీలక ప్రకటన చేసింది. 2021 మే 7, శుక్రవారం రాత్రి డిజిటల్ సేవలు పనిచేయవని తెలిపింది. బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లను అప్‌గ్రేడ్ చేయడం వల్ల డిజిటల్ సేవలు

ఈరోజు రాత్రి SBI డిజిటల్ సేవలు బంద్

Sbi Digital Services

 SBI digital services :స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) కీలక ప్రకటన చేసింది. 2021 మే 7, శుక్రవారం రాత్రి డిజిటల్ సేవలు పనిచేయవని తెలిపింది. బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లను అప్‌గ్రేడ్ చేయడం వల్ల డిజిటల్ సేవలు ప్రభావితమవుతాయని తెలిపింది. ఎస్బిఐ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లైన యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) గత నెలలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాయి. దీంతో షెడ్యూల్ నిర్వహణ కారణంగా శుక్రవారం, శుక్రవారం రాత్రి 10.15 నుండి తెల్లవారుజామున 1.45 వరకు..  యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) అందుబాటులో ఉండవని ఎస్బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా దేశవ్యాప్తంగా 22,000 బ్రాంచ్‌లు,57,899 ఎటిఎంలతో అతిపెద్ద నెట్‌వర్క్‌ ఎస్‌బిఐకి ఉంది. డిసెంబర్ 31, 2020 నాటికి ఈ బ్యాంకులో 85 మిలియన్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్, 19 మిలియన్ మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులు ఉన్నారు. అలాగే 135 మిలియన్ల యుపిఐ వినియోగదారులను కలిగి ఉంది, ప్రస్తుతం 35 మిలియన్ రిజిస్టర్డ్ యూజర్లతో ఎస్బిఐ టాప్ లో ఉంది.