SBI Alert : ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. ఆ నెంబర్లతో జాగ్రత్త!

ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ నెంబర్ల విషయంలో జర జాగ్రత్త.. ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ కస్టమర్లను ఇదే విషయంలో హెచ్చరిస్తోంది.

SBI Alert : ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. ఆ నెంబర్లతో జాగ్రత్త!

Sbi Issues Warning For Customers ‘beware Of Fraudulent Customer Care Numbers’

SBI issues warning : ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక.. ఆ నెంబర్ల విషయంలో జర జాగ్రత్త.. ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తమ కస్టమర్లను ఇదే విషయంలో హెచ్చరిస్తోంది. ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఎస్బీఐ కస్టమర్ కేర్ నెంబర్ల పేరుతో ఫేక్ నెంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కస్టమర్లను హెచ్చరిస్తోంది.

తప్పుడు కస్టమర్‌ కేర్‌ నంబర్లను గుర్తించకపోతే మోసాల బారిన పడే ప్రమాదం ఉందని ఎస్బీఐ హెచ్చరించింది. డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోవడంతో సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ కస్టమర్ నెంబర్లతో ఖాతాదారులకు ఫోన్ కాల్స్ చేసి డబ్బులు కాజేస్తున్నారు. కస్టమర్ల వ్యక్తిగత డేటాను సేకరించి వారినుంచి డబ్బులు కొట్టేసేందుకు సైబర్ మోసగాళ్లు ప్రయత్నిస్తున్నారని ఎస్బీఐ గుర్తించింది. వ్యక్తిగత డేటాను సైబర్‌ నేరస్తుల కంటపడితే ప్రమాదమని హెచ్చరించింది.


ఎస్‌బీఐ తమ కస్టమర్లకు అవగాహన కల్పించేందుకు ఓ వీడియోను అధికారిక ట్విటర్‌ అకౌంట్లో పోస్ట్‌ చేసింది. ఎస్‌బీఐ ఆ ట్విట్‌లో ‘మోసపూరిత కస్టమర్‌ కేర్‌ నంబర్లతో జర జాగ్రత్త.. బ్యాంకు కస్టమర్ కేర్ నెంబర్ల కోసం గూగుల్ సెర్చ్ చేయొద్దని సూచించింది. ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ విజిట్ చేసి అక్కడి కస్టమర్ నెంబర్ల ద్వారా ఫోన్ కాల్స్ చేసుకోవాలని సూచించింది. మీ బ్యాంకు అకౌంట్ వివరాలు, వ్యక్తిగత డేటాను ఎవరితోనూ షేర్ చేయొద్దని ఎస్బీఐ సూచించింది.
Read Also :  Jio vs Airtel : జియోకు షాకిచ్చిన యూజర్లు.. ఎయిర్‌టెల్‌కు కొత్త యూజర్లు!