ఒడిశాలో బాలుడిపై బ్రిటన్ వ్యక్తి అత్యాచారం..స్వచ్ఛంధ సంస్థ ముసుగులో దారుణం

  • Published By: nagamani ,Published On : August 21, 2020 / 03:34 PM IST
ఒడిశాలో బాలుడిపై బ్రిటన్ వ్యక్తి అత్యాచారం..స్వచ్ఛంధ సంస్థ ముసుగులో దారుణం

స్వచ్ఛంద సంస్థల ముసుగులో చిన్నారులపై జరిగే అకృత్యాలు..అఘాయిత్యాలకు అంతులేకుండాపోతోంది. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తామని వసతి కల్పిస్తూ..వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఒళ్లు గగొర్పొడుస్తున్నాయి. ముక్కు పచ్చలారని చిన్నారులను చిదిమేస్తున్నారు. చిన్నారులపై లైంగిక వాంఛ తీర్చుకుంటున్న మృగాళ్ల దారుణాలు బైటపడుతుంటే ఇంకెక్కడ వారి జీవితాలకు భద్రత అనే ప్రశ్న తలెత్తుతోంది.



భారత్ లో ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోనూ ఓ అనాథ బాలికపై హాస్టల్ నిర్వాహకుడు అత్యాచారం జరిపిన ఘటన మర్చిపోక ముందే మరోక దారుణం వెలుగులోకి వచ్చింది. ఒడిశాలో ఓ విదేశీయుడు స్వచ్ఛంద సంస్థ పేరుతో హాస్టల్ ఏర్పాటు చేసి మైనర్ బాలుడిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. జాన్ పాట్రిక్ బ్రిడ్జ్ అనే బ్రిటన్ వ్యక్తి కొంత కాలం క్రితం ఒడిశాలోని జార్సుగుడా ప్రాంతానికి వచ్చాడు. స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు. అక్కడ పేద, అనాథ పిల్లల కోసం ఓ హాస్టల్ కూడా ఏర్పాటు చేశాడు.



ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఓ బాలుడిపై జాన్ పాట్రిక్ లైంగిక వేదింపులకు పాల్పడ్డాడు. అనంతరం అత్యాచారానికి ఒడిగట్టాడనే విషయం బయటకు రావడంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు జాన్ పాట్రిక్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.అంతేకాదు స్వచ్ఛంధ సంస్థలకు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను కూడా స్వాహా చేస్తున్నాడని.. పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రాహుల్ తెలిపారు.