ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్న టీబీ పేషెంట్ పై అత్యాచారం

  • Published By: nagamani ,Published On : October 29, 2020 / 04:43 PM IST
ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్న టీబీ పేషెంట్ పై అత్యాచారం

Gurugram TB patient raped: కామాంధులు ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే మహిళలను కూడా వదలడం లేదు. ఇటీవల ఢిల్లీకి సమీపంలో ఉన్న గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతోన్న 21ఏళ్ల యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షిణించిపోయింది. ఈ దారుణం జరిగిన ఆరు రోజుల తర్వాత ఆమె స్పృహలోకి రావటంతో తనపై జరిగిన దారుణం గురించి గత మంగళవారం (అక్టోబర్ 27,2020) తండ్రితో చెప్పింది. వెంటనే తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


టీబీలో బాధపడుతున్న బాధితురాలిని క్రిందటి బుధవారం( అక్టోబర్ 21,2020) గురుగ్రాంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో అదే ఆస్పత్రిలో పని చేస్తున్న వికాస్‌ అనే వ్యక్తి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.


దీంతో మరోసారి బాధితురాలి ఆరోగ్యం క్షీణించింది. తనపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి చెప్పటానికి కూడా ఆమె పరిస్థితి బాగాలేదు. కానీ ఆ కామాంధుడికి మాత్రం అదేమీ పట్టలేదు.దారుణ అకృత్యాన్ని పదే పదే చేయటంతో ఆమె ఆరోగ్యం దారుణంగా మారింది.


ఈ క్రమంలో ఆమె కాస్త కోలుకుని ఓపిక వచ్చాక తనపై జరిగిన దారుణం గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పటానికి యత్నించింది. కానీ సాధ్యం కాలేదు. దీంతో ఆమె చేతికి పెన్ను పేపర్ ఇవ్వటంతో దానిపై తనపై అత్యాచారం జరిగిందని చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు స్థానిక సుశాంత్‌ లోక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు వికాస్‌పై కేసు నమోదు చేశారు. ఆమె ఆరోగ్యం కుదుట పడిన తరువాత ఆసుపత్రికి వెళ్లి వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


ప్రస్తుతం ఆమె మాట్లాడే పరిస్థితిలో లేదని డాక్టర్లు చెప్పారని అన్నారు. దీనిపై ఆధారాల కోసం ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇదే ఆస్పత్రిలో తమ కూతురిని ఉంచినట్లయితే ఆధారాలు మాయం చేసే ప్రయత్నాలు జరుగుతాయని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెను వెంటనే ప్రభుత్వ సుపత్రికి తరలించాలని పోలీసులను కోరారు.


దీనిపై కమిషనర్ కెకె రావు మాట్లాడుతూ..గత బుధవారం హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి బాధితురాలికి భద్రత కల్పిస్తామని తెలిపారు. అత్యాచార నిందితుడు హాస్పిటల్ నియమించుకున్న కాంట్రాక్ట్ సిబ్బంది అని తెలిపారు. అక్టోబర్ 21-27 మధ్య తమకూతురికి పలుమార్లు అత్యాచారం జరిగింది యువతి తల్లిదండ్రులు తెలిపారని అన్నారు.