కారుతో బైకును ఢీకొట్టి….. బానట్‌పై పడినా ఆపకుండా ఈడ్చుకెళ్లి..

  • Published By: murthy ,Published On : August 29, 2020 / 08:32 AM IST
కారుతో బైకును ఢీకొట్టి….. బానట్‌పై పడినా ఆపకుండా ఈడ్చుకెళ్లి..

ఇద్దరు వాహనదారుల మధ్య వివాదం ఒక వ్యక్తి ప్రాణాలు మీదికి తెచ్చింది. ఢిల్లీలోని వికాస్‌పురి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ ఉత్తర ప్రాంతం పంఖా రోడ్డులో నివాసం ఉంటున్న చేతన్‌ గురువారం రాత్రి బైక్‌పై వెళ్తుండగా నజాఫ్‌గఢ్‌ రోడ్డులో కారు ఢీకొట్టింది.



కింద పడిన చేతన్, కారు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. డ్రైవర్ సరైన సమాధానం చెప్పకపోవటంతో, కారు దిగి బయటకు రమ్మని కారు ముందు అడ్డంగా నిలబడ్డాడు.డ్రైవర్ దిగి రాకపోగా, అడ్డు తప్పుకోవాలని గద్దించాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో డ్రైవర్‌, కారుతో చేతన్‌ను ఢీకొట్టి ముందుకు పోనిచ్చాడు.
https://10tv.in/creative-farmers-flowing-corn-seeds-with-the-help-of-a-bike-anand-mahindra-shared-a-unique-video/
చేతన్ బానట్‌పై పడి వైపర్‌లను పట్టుకున్నాడు. డ్రైవర్ వాహనాన్ని వేగంగా నడపడంతో పట్టుకోల్పోయి కిందపడ్డా ఆపకుండా 150 మీటర్ల దూరం లాకెళ్లాడు. ఇది చూసిన స్థానికులు కారును ఆడ్డగించడంతో, అందులోని ఇద్దరు కారు అక్కడ వదిలేసి పారిపోయారు. గాయపడిన చేతన్‌ను  స్ధానికులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తీసుకెళ్లారు.



మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపీసీ 279 (రాష్ డ్రైవింగ్), 307 (హత్యాయత్నం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు. నిందితులు కారు డీలర్లని ఉత్తమ్ నగర్‌లోనే నివాసం ఉంటారని డిప్యూటీ పోలీస్ కమిషనర్ (వెస్ట్) దీపక్ పురోహిత్ తెలిపారు.