11ఏళ్ల కొడుకు తండ్రికే బెదిరింపులు: రూ.10 కోట్లు ఇస్తే వదిలేస్తా..లేదంటే ఫ్యామిలి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేస్తానంటూ బ్లాక్ మెయిల్

11ఏళ్ల కొడుకు తండ్రికే బెదిరింపులు: రూ.10 కోట్లు ఇస్తే వదిలేస్తా..లేదంటే ఫ్యామిలి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేస్తానంటూ బ్లాక్ మెయిల్

Ghaziabad 11 years boy haching.. demands rs. 10 crore from father :  యూట్యూబ్‌లో సైబర్‌ క్రైమ్‌ వీడియో చూసిన 11ఏళ్ల పిల్లాడు ఏకంగా తండ్రినే బ్యాక్ మెయిల్ చేశాడు. రూ.పది కోట్లు ఇస్తే వదిలేస్తాను… లేదంటే మీ ఫ్యామిలీ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తానంటూ డిమాండ్‌ చేశాడు..! మీ ఈమెయిల్‌ హ్యాక్‌ చేసి మీ పర్సన్ విషయాలు..వివరాలు, కుటుంబసభ్యుల ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో చోటుచేసుకుంది.

చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేయటంతో గుట్టు రట్టు అయ్యింది. దీంతో తనను బెదిరించింది తన 11 ఏళ్ల కొడుకేనని తెలిసిన ఆ తండ్రికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. దిమ్మతిరిగిపోయింది పాపం…పోలీసులు ఆ పిల్లాడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా..యూట్యూబులో సైబర్ క్రైమ్ వీడియోలు చూసి ఇలా చేశానని చెప్పటంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు..!!

ఘజియాబాద్‌లోని ఓ వ్యక్తి జనవరి 1న తన ఈమెయిల్‌, ఇతర వివరాలు హ్యాకయ్యాయని.. ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేసి తనకు రూ.పది కోట్లు ఇవ్వాలని..డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ వ్యక్తిగత వివరాలతో పాటు ఫొటోలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఎక్కడి నుంచి బెదిరింపులు వస్తున్నాయో పోలీసులు ఆరా తీశారు. ఐపీ అడ్రస్‌ పరిశీలించారు. అలా ఎవరైతే తన మెయిల్స్ హ్యాక్ అయ్యాయని ఫిర్యాదుచేసాడో ఆ వ్యక్తి ఇంటి నుంచే ఆ బెదిరింపులు వస్తున్నాయని గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు. దీంతో ఇంట్లో వివరాలు సేకరించగా అతడి కుమారుడే ఈ పని చేస్తున్నాడని తెలుసుకోవటం తండ్రితో పాటు ఇంటిలో వాళ్లంతా ఆశ్చర్యపోయారు.

5th class చదువుతున్న 11 ఏళ్ల బాలుడు యూట్యూబ్‌లో సైబర్‌ క్రైమ్‌ వీడియోలు చూసి ఇలా తండ్రిపైనే ప్రయోగించాడని పోలీసులు తెలిపారు. హ్యాకింగ్‌కు సంబంధించిన వీడియోలతో పాటు ఆన్‌లైన్‌ మోసాలకు సంబంధించిన వీడియోలు చూసి తాను నేర్చుకున్నట్లు బాలుడు పోలీసులకు చెప్పాడు. అలా హ్యాక్ చేస్తూ..తండ్రికి ఇతర మెయిల్స్‌ నుంచి పంపి డబ్బులు డిమాండ్‌ చేసానని చెప్పాడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు.