militants killed: కాశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు తీవ్రవాదులు హతం

కాశ్మీర్‌ లోయలో జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్‌, కుప్వారా జిల్లాలోని కండి ప్రాంతంలో సోమవారం సాయంత్రం పోలీసులు, ఆర్మీ కలిసి సంయుక్తంగా సెర్చింగ్ నిర్వహించారు.

militants killed: కాశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు తీవ్రవాదులు హతం

Militants Killed

militants killed: కాశ్మీర్‌ లోయలో జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్‌, కుప్వారా జిల్లాలోని కండి ప్రాంతంలో సోమవారం సాయంత్రం పోలీసులు, ఆర్మీ కలిసి సంయుక్తంగా సెర్చింగ్ నిర్వహించారు. ఈ ప్రాంతంలో తీవ్రవాదులు తలదాచుకున్నట్లు అందిన సమాచారం ఆధారంగా కూంబింగ్ నిర్వహించారు. తీవ్రవాదులు ఉన్న ప్రాంతానికి చేరుకోగానే పోలీసులు, సైన్యంపై కాల్పులు ప్రారంభించారు. దీంతో భారత సైన్యం కూడా ఎదురు కాల్పులు ప్రారంభించింది. ఈ కాల్పుల్లో ఇద్దరు లష్కరే తొయిబా తీవ్రవాదులు మరణించారు. వీరిలో ఒకరిని పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Woman Cyclist: కోచ్‌ అసభ్య ప్రవర్తన.. మహిళా సైక్లిస్ట్ ఫిర్యాదు

బారాముల్లా జిల్లాలోని పానిపోరా అటవీ ప్రాంతంలో ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. ఈ ప్రాంతంలో కూడా సోదాలు నిర్వహిస్తుండగా తీవ్రవాదులు సైన్యంపై కాల్పులు జరిపాయి. దీంతో సైన్యం, పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. దాదాపు గంటసేపు ఈ కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో లష్కరే తొయిబాకు చెందిన మరో తీవ్రవాది మరణించాడు. ఈ తీవ్రవాదిని పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47, ఐదు మ్యాగజైన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.