Pushpa : పుష్ప సినిమా మాదిరి తగ్గేదేలే అన్నాడు..షాకిచ్చిన పోలీసులు

కొంతమంది సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటారు. అవి మంచి జరిగితే పర్వాలేదు వాటివల్ల నష్టం జరిగితేనే ఇబ్బంది. సంగారెడ్డి జిల్లాలో కదులుతున్న ఆటోపై ఎక్కి పుష్ప సినిమాలో డైలాగ్ లు చెప్పిన ఆటోడ్రైవర్ కు పోలీసులు ఫైన్ విధించారు.

Pushpa : పుష్ప సినిమా మాదిరి తగ్గేదేలే అన్నాడు..షాకిచ్చిన పోలీసులు

Naraynkhed Auto Driver

Pushpa : కొంతమంది సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటారు. అవి మంచి జరిగితే పర్వాలేదు వాటివల్ల నష్టం జరిగితేనే ఇబ్బంది. సంగారెడ్డి జిల్లాలో కదులుతున్న ఆటోపై ఎక్కి పుష్ప సినిమాలో డైలాగ్ లు చెప్పిన ఆటోడ్రైవర్ కు పోలీసులు ఫైన్ విధించారు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా ఎన్ని రికార్డులు  క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందులో   హీరో మేనరిజం చాలా మంది ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటం కూడా చూశాము.  సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ఉండే ఆటోడ్రైవర్  కూడా అల్లు అర్జున్ లాగా వీడియో చేయాలనుకుని తన ఆటో ఎక్కి వీడియో తీశాడు.

ఎం. సాయిలు అనే ఆటోడ్రైవర్ తన ఆటోపైకి ఎక్కాడు.  ఆటోను అతని   స్నేహితుడు డ్రైవ్ చేస్తున్నాడు. కదులుతున్న ఆటో పై  నిలబడిని సాయిలు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లాగా తగ్గేదేలే అంటూ గడ్డం కింద చేయిపెట్టి ఆ డైలాగును అనుకరించాడు.

అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో అటు తిరిగి ఇటు తిరిగి పోలీసుల కంట పడింది. దీంతో వారు సీరియస్ గా యాక్షన్ తీసుకున్నారు. సాయిలు ఆటోకు రూ. 1000 లు, నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.500,  ఆటోపై ఎక్కి ప్రయాణించినందుకు రూ. 100 జరిమానా విధించారు.

Also Read : Tesla: కూర్చోవడానికీ ప్లేస్ లేని టెస్లా ఆఫీస్.. ఉద్యోగుల అవస్థలు