Bike e-Challan : చలానాలు కట్టే బదులు కొత్త బండి కొనుక్కోవచ్చు.. బైక్ వదిలి పరార్

తన బైక్ పై పోలీసులు విధించిన చాలానాలు కట్టే బదలు  కొత్త బైక్  కొనుక్కోవచ్చనుకున్న ఒక వాహాన దారుడు తన బైక్ వదిలి పరారయ్యాడు.     

Bike e-Challan : చలానాలు కట్టే బదులు కొత్త బండి కొనుక్కోవచ్చు.. బైక్ వదిలి పరార్

Traffic Challans

Bike e-Challan : ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా, వాళ్ల వద్ద ఉన్న కెమెరాల  ద్వారా ట్రాఫిక్ నింబందనలు ఉల్లంఘించిన వారి ఫోటోలు తీసి వాటిపై  చలానాలు విధిస్తున్న సంగతి తెలిసిందే.  హైదరాబాద్ లో తన బైక్ పై పోలీసులు విధించిన చాలానాలు కట్టే బదలు  కొత్త బైక్  కొనుక్కోవచ్చనుకున్న ఒక వాహాన దారుడు తన బైక్ వదిలి పరారయ్యాడు.

హైదరాబాద్ అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తా‌లో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు సోమవారం రాత్రి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో హీరో హోండా ప్యాషన్ బైక్‌పై వచ్చిన వాహనదారుడు పోలీసులను చూసి బైక్ వదిలి పారిపోయాడు. వాహానదారుడు బైక్ వదిలిపోయి పారిపోవటంతో ఆ బైక్ నెంబర్‌ AP 23 M 9895ను తమ దగ్గర ఉన్న రికార్డులలో పరిశీలించిన పోలీసులు ఒక్క సారి షాక్‌కు గురయ్యారు.
Also Read : Banjara Hills Car Accident Case : బంజారాహిల్స్ కారు ప్రమాదం కేసులో ఇద్దరు అరెస్ట్
సదరు బైక్ పై 179 చలానాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిపై విధించిన జరిమానా రూ.42,475 లు ఉంది.  అంత పెద్ద మొత్తంలో జరిమానా ఉండటంతో నిందితుడు బైక్ వదిలి పారిపోయాడు. పోలీసులు బైక్ సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు.