Haryana: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రైలు ఢీకొని బీఎస్ఎఫ్ జవాన్ మృతి..

హర్యానాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై వేగంగా దూసుకొస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు వేగాన్ని అంచనా వేయలేక పట్టాలు దాటేందుకు యత్నించిన వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.

Haryana: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రైలు ఢీకొని బీఎస్ఎఫ్ జవాన్ మృతి..

Veer Singh

Haryana: హర్యానాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై వేగంగా దూసుకొస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు వేగాన్ని అంచనా వేయలేక పట్టాలు దాటేందుకు యత్నించిన వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన విషాధ ఘటన అక్కడి సీసీ టీవీ పుటేజీల్లో నమోదైంది. ఈ ఘటన మహేంద్రగఢ్ జిల్లా మజ్రా ఖుర్ద్ గ్రామం పరిధిలో చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) జవాన్ వీర్ సింగ్‌గా గుర్తించారు. రైలు దగ్గరకు వచ్చిన క్రమంలో అతను రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపించింది. దీంతో రైలు ఢీకొనడంతో వీర్ సింగ్ బాడీ ఎగిరి కొద్దిదూరంలో పడినట్లు వీడియోలో కనిపించింది.

Kerala Government: ఆ వస్తువులకు మా రాష్ట్రంలో జీఎస్టీ అమలుచేయం.. కేరళ సర్కార్ కీలక నిర్ణయం

రైలు పట్టాలు దాటే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తుంది. రైల్వే ఫ్లాట్ ఫాంల వద్ద రైలు ఎక్కే క్రమంలో, దిగే క్రమంలో తొందరపాటుకు గురికావొద్దని, రైలు ఆగిన తరువాత రైలు దిగాలని రైల్వే శాఖ ప్రయాణీకులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉంటుంది. అయినా కొందరు అత్యుత్సాహంతో, కొందరు తెలియక రైలు దిగే క్రమంలో, ఎక్కే క్రమంలో ప్రమాదాల భారిన పడుతుండటం మనం చూస్తున్నాం. రైల్వే గేట్ వద్దసైతం రైలు రావటం లేదనే ఉద్దేశంతో పట్టాలు దాటే క్రమంలో పలువురు ప్రమాదాల భారిన పడ్డారు. ఇదే తరహాలో వీర్ సింగ్ రైలు వేగాన్ని అంచనా వేయలేక పట్టాలు దాటే ప్రయత్నం చేయడంతో రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు.

Encounter: పంజాబ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసులు, సిద్ధూ మూసేవాలా హంతకులకు మధ్య కాల్పులు

ఈ ప్రమాదంలో వీర్ సింగ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అతను అక్కడే చనిపోయాడు. స్థానికులు అతడని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 2001 లో వీర్ సింగ్ బీఎస్ఎఫ్ లో చేరినట్లు స్థానికులు తెలిపారు. సెలవులు పెట్టుకుని ఇంటికి వస్తే.. ఇంత ఘోరం జరిగిపోయిందని అతని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. వీర్ సింగ్ మహేంద్రగఢ్ జిల్లాలోని బవానా గ్రామ వాసి, సెలవులో ఉన్న అతను సోమవారం జిల్లాలోని మజ్రా ఖుర్ద్ గ్రామంలో తన సోదరిని ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మహేంద్రగఢ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.