Uttar Pradesh: మోదీ-యోగీ రాజకీయాలపై చర్చ.. కారుతో ఢీకొట్టి చంపిన డ్రైవర్

వింద్యాచల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడి పేరు రాజేష్దర్ దూబే (50). బంధువు వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మిర్జాపూర్ వెళ్లాడు. అనంతరం సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బొలేరో కారు మాట్లాడుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు.

Uttar Pradesh: మోదీ-యోగీ రాజకీయాలపై చర్చ.. కారుతో ఢీకొట్టి చంపిన డ్రైవర్

Mirzapur: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీద జరిగిన రాజకీయ చర్చ ఒక వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చింది. బాధితుడు ప్రధాని మోదీని పొగిడారు. అంతే కాకుండా యోగిపై విమర్శ చేయకుండా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన కారు డ్రైవర్.. కారుతో ఢీకొట్టి చంపాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మిర్జాపూర్‭లోని కొలాహి గ్రామంలో జరిగిందీ దుర్ఘటన. సీసీటీవీ పుటేజీ, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Adapa Seshu: కాపులను మోసం చేయడానికే పవన్ వారాహి యాత్ర.. అంతా కలిసి కుట్ర చేస్తున్నారు

వింద్యాచల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడి పేరు రాజేష్దర్ దూబే (50). బంధువు వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మిర్జాపూర్ వెళ్లాడు. అనంతరం సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి బొలేరో కారు మాట్లాడుకుని స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు. దారి మధ్యలో డ్రైవరుతో రాజకీయ చర్చ ప్రారంభమైంది. మోదీని దూబే విపరీతంగా పొగిడారు. అంతే కాకుండా యోగిపై విమర్శలు చేయకుండా డ్రవైరును అడ్డుకున్నారు.

Bihar Politics: నితీశ్-తేజశ్వీలకు ఝలక్.. మంత్రి పదవికి రాజీనామా చేసిన సంతోష్ కుమార్

దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన డ్రైవర్.. దూబే సహా ఇతరులను కారు నుంచి దింపాడు. అతడు వెళ్లిపోతుండగా.. కారుకు దూబే అడ్డం వెళ్లాడు. అంతే, దూబేను ఢీకొట్టాడు, అనంతరం కారును అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. సుమారు 20 మీటర్ల దూరం దూబేను ఈడ్చుకెళ్లినట్లు సహా ప్రయాణికులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అందగానే రంగంలోకి దిగిన పోలీసులు ఆరు గంటలు దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడి పేరు అమ్జాద్ అని పోలీసులు తెలిపారు.