Chhattisgarh : మద్యం తాగి స్కూలు వచ్చిన మహిళా టీచర్

సాధారణంగా పురుష   ఉపాధ్యాయులు మద్యం సేవించి   స్కూలుకు వస్తుంటారని వార్తల్లో చదువుతూ ఉంటాము. కానీ వీటికి భిన్నంగా ఒక మహిళా ఉపాధ్యాయురాలు స్కూలుకు తాగి వచ్చి క్లాస్ రూమ్ లో కింద పడుకుని నిద్రపోయిన ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది.

Chhattisgarh : మద్యం తాగి స్కూలు వచ్చిన మహిళా టీచర్

Drunken Teacher

Chhattisgarh : సాధారణంగా పురుష   ఉపాధ్యాయులు మద్యం సేవించి   స్కూలుకు వస్తుంటారని వార్తల్లో చదువుతూ ఉంటాము. కానీ వీటికి భిన్నంగా ఒక మహిళా ఉపాధ్యాయురాలు స్కూలుకు తాగి వచ్చి క్లాస్ రూమ్ లో కింద పడుకుని నిద్రపోయిన ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది.

జష్ పూర్ జిల్లా విద్యాశాఖాధికారి   సిధ్ధిక్  రోజు వారీ తనిఖీల్లో భాగంగా గురువారం ఒక ప్రభుత్వం స్కూలు‌కు వెళ్లారు.  అక్కడ  3,4 తరగతుల పిల్లలకు పాఠాలు చేప్పే లేడీ టీచర్ జగపతి భగత్  నేలపై పడుకుని ఉంది.  ఆమెను చూసి ఒంట్లో బాగోలేదేమో అనుకుని పిల్లలను అడగగా…తమ టీచర్ మద్యం సేవించి వచ్చిందని వాళ్లు చెప్పారు. వాళ్లు చెప్పిన సమాధానం విని ఆయన షాకయ్యారు. గత కొద్దిరోజులుగా ఆమె మద్యం సేవించి స్కూలు వస్తున్నట్లు తెలుసుకున్నారు.

వెంటనే   విద్యాశాఖాధికారి స్దానిక పోలీసు స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు.  అక్కడి నుంచి వచ్చిన ఇద్దరు మహిళా   కానిస్టేబుళ్ల   సాయంతో టీచర్‌ను   ఆస్పత్రికి తీసుకు వెళ్లి రక్త పరీక్షలు చేయించారు. రక్త నమూనాలలో  మద్యం సేవించినట్లు నిర్ధారణ కావటంతో జగపతి భగత్ ను సస్పెండ్ చేశారు.   మరో వైపు జూన్ 16న  ప్రారంభమైన ఈ విద్యా సంవత్సరంలో   జష్ పూర్   జిల్లాలో ఇప్పటి వరకు ఐదుగురు ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు. వీరిలో ముగ్గురు టీచర్లు మద్యం సేవించి స్కూలు రావటం వల్లే సస్పెండయ్యారు.

Also Read : Odisha : హీరోయిన్‌తో నడిరోడ్డుపై దొరికిపోయిన హీరో…రచ్చ చేసిన హీరో భార్య