Cops Raid On Prostitution Center : మసాజ్ సెంటర్‌లో వ్యభిచారం…ముగ్గురు మహిళలతో సహా ఐదుగురు అరెస్ట్
హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకుడిని, ఓ విటుడుని,ముగ్గురు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Prostitution In Massage Center
Cops Raid On Prostitution Center : హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకుడిని, ఓ విటుడుని,ముగ్గురు యువతులను పోలీసులు అరెస్ట్ చేశారు.
గత కొంతకాలంగా వెన్నెలగడ్డ సమీపంలోని ఓ అపార్ట్ మెంట్‌లోని ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌లోని మసాజ్ సెంటర్‌కు రోజు రోజుకు వచ్చే కస్టమర్ల సంఖ్య పెరగటంతో అపార్ట్‌మెంట్ వాసులకు అనుమానం కలిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసులు అపార్ట్ మెంట్ మీద నిఘా పెట్టారు.
Also Read : Cyber Crime : సెల్ ఫోన్ హ్యాక్ చేసి రూ.25 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
పోలీసులు కస్టమర్లలాగా మసాజ్ సెంటర్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. మసాజ్ సెంటర్‌లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని నిర్ధారించుకున్నతర్వాత పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుడితోపాటు ఓ విటుడు, ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మహిళలను రెస్క్యూ హోం కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.