UP Crime : దళిత కుటుంబంలో నలుగురు హత్య..చంపేముందు బాలికపై గ్యాంగ్ రేప్

ఓ దళిత కుటుంబంలో నలుగురిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. చంపేముందు ఆ కుటుంబంలోని బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.

UP Crime : దళిత కుటుంబంలో నలుగురు హత్య..చంపేముందు బాలికపై గ్యాంగ్ రేప్

Up Crime

Four In a Family Murdered Brutally Girl Gang Raped : దళితులపై దాడులు..అవమానాలు అంటూ ఎన్నో వింటున్నాం. ఇదే క్రమంలో ఓ దళిత కుటుంబంపై అగ్రకులస్థులు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. అత్యంత అమానుషంగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో ఒకే కుటుంబంలోని నలుగురిని చంపేశారు. చంపేముందు ఆ కుటుంబంలో ఉన్న ఓ యువతిపై సామూహికత అత్యాచారానికి పాల్పడ్డారు.

హత్యకు గురైనవారిలో 16 ఏళ్ల బాలిక, 10ఏళ్ల బాలుడు ఉన్నారు.హత్యకు ముందు బాలికపై నిందితులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. బాధిత కుటుంబాన్ని దళిత ఫ్యామిలీగా పోలీసులు గుర్తించారు. పొరుగున ఉండే అగ్రకులంవారే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని చనిపోయిన వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడివారి పేర్లు కూడా చెప్పటంతో పోలీసులు 11మందిపై కేసులు నమోదు చేశారు. హత్య,సామూహిక అత్యాచారం కింద కేసులు నమోదుచేసి కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.పరారీలో ఉన్న మరికొంతమందికోసం గాలిస్తున్నారు.

హత్యకాండ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు అన్ని వివరాలు నోట్ చేసుకున్నారు. హత్యలు జరిగిన తీరును బట్టి పదునైన ఆయుధంతో వారిపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. బాధితుల ఒంటిపై అత్యంత తీవ్రమైన గాయాలున్నాయని..బాలిక మృతదేహం వేరే గదిలో కనిపించిందని..బాలికపై అత్యాచారం జరిగినట్లుగా తెలుస్తోందని అన్నారు. మిగతా ముగ్గురి మృతదేహాలు పెరట్లో పడేశారని చెప్పారు. 2019 నుంచి ఓ అగ్రకులానికి చెందిన కుటుంబంతో భూ తగాదాలు నడుస్తున్నాయని, సెప్టెంబర్ లో ఒకసారి ఆ కుటుంబం వారు దాడికి పాల్పడ్డారని..వారే ఈ హత్యలు చేసి ఉండొచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు.

ఈ కేసుపై రాజీ కుదిర్చేందుకు పోలీసులు బలవంతం చేస్తున్నారని..నిందితుల ఇంటికి పోలీసులు తరచు వెళ్తున్నారని..దళితుల దుస్థితి ఇక ఇంతేనా? ఇన్ని దారుణాలకు పాల్పడుతున్నా..నిలువునా ప్రాణాలు తీసేస్తున్నా అగ్రకులస్థులపై చర్యలు తీసుకోరా? అని ఆవేదనగా ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ ఆరోపణల్ని ప్రయాగ్ రాజ్ పోలీస్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఖండించారు. నలుగురి తలలపై గొడ్డలి వేటుతో హత్య చేసినట్టు తెలుస్తోందని..దీనిపై విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.