Drugs Gang Arrest : భారీగా డ్రగ్స్ పట్టివేత.. విదేశాల నుండి కొకైన్ తెచ్చి విక్రయిస్తున్న ముఠా అరెస్టు

నైజీరియన్ కు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ ను అదుపులోకి తీసుకున్నారు. కోట్ల రూపాయల కొకైన్ ను పోలీసులు సీజ్ చేశారు.

Drugs Gang Arrest : భారీగా డ్రగ్స్ పట్టివేత.. విదేశాల నుండి కొకైన్ తెచ్చి విక్రయిస్తున్న ముఠా అరెస్టు

Drugs Gang Arrest

Drugs Gang Arrest : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. విదేశాల నుండి కొకైన్ తెచ్చి విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నైజీరియన్ తో పాటు ఐదుగురిని సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియన్ కు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ ను అదుపులోకి తీసుకున్నారు. కోట్ల రూపాయల కొకైన్ ను పోలీసులు సీజ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు.

సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారని మరొక నైజీరియన్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. నైజీరియాకి చెందిన A-2 గాబ్రియల్ నైజీరియాకి పారి పోయాడని తెలిపారు. చింతా రాకేష్ ఈ ముఠాకి కింగ్ పిన్ అని పేర్కొన్నారు. గోవా నుంచి కొకైన్ తెచ్చి ఇక్కడ సప్లై చేస్తున్నాడని వెల్లడించారు. డ్రై ఫ్రూట్ బిజినెస్ లో లాస్ రావడంతో డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని చెప్పారు.

Vijayawada Drugs : విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఆర్టీసీ బస్సులో కిలో ఎండీఎంఎ డ్రగ్స్ పట్టివేత

గోవాలో ఒక గ్రాము డ్రగ్స్ రూ.7 వేలకు కొనుగోలు చేసి… హైదరాబాద్ లో రూ.18 వేలకు అమ్ముతున్నాడని పేర్కొన్నారు. కోటి 33 లక్షల రూపాయల విలువైన 303 గ్రామ్స్ కొకైన్ సీజ్ చేశామని తెలిపారు. రెండు కార్లు, 5 సెల్ ఫోన్స్ సీజ్ చేశామని చెప్పారు. A-4 సూర్య ప్రకాష్ ని పట్టుకోవడంతో ఈ ముఠా గురించి బయటపడిందన్నారు. కస్టమర్స్ ఎవరో గుర్తించే పనిలో ఉన్నామని.. వారికి నోటీసులు ఇస్తామని చెప్పారు.

ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 27 ప్రకారం కష్టమర్స్ కి నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు. వాట్సాప్ ద్వారా కస్టమర్లను ఈ ముఠా సంప్రదిస్తుందన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీలు హోస్ట్ చేసి.. కంజ్యూమర్స్ ని పిలిచి అక్కడ డ్రగ్స్ సప్లై చేస్తున్నారని తెలిపారు. నిందితుల వాట్సాప్ చాట్ లో కొంతమంది ప్రముఖ వ్యారవేత్తలు కూడా ఉన్నారని తెలిపారు. కొకైన్ కి మార్కెట్ లో బాగా డిమాండ్ ఉందన్నారు.