Vijayawada Drugs : విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఆర్టీసీ బస్సులో కిలో ఎండీఎంఎ డ్రగ్స్ పట్టివేత

గుర్తు తెలియని వ్యక్తి తనకు బ్యాగ్ ఇచ్చి విజయవాడలో అందజేయాలని చెప్పారని పోలీసులకు బస్సు డ్రైవర్ చెప్పారు. ప్రస్తుతం డ్రైవర్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు.

Vijayawada Drugs : విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఆర్టీసీ బస్సులో కిలో ఎండీఎంఎ డ్రగ్స్ పట్టివేత

Vijayawada

Updated On : April 2, 2023 / 12:52 PM IST

Vijayawada Drugs : విజయవాడలో డ్రగ్స్ మరోసారి కలకలం రేపింది. బెంగుళూరు నుంచి వచ్చిన అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో కిలో ఎండీఎంఎ డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.  గుర్తు తెలియని వ్యక్తి తనకు బ్యాగ్ ఇచ్చి విజయవాడలో అందజేయాలని చెప్పారని పోలీసులకు బస్సు డ్రైవర్ చెప్పారు.

ప్రస్తుతం డ్రైవర్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. బస్సు ట్రాన్స్ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు గుర్తుతెలియని వ్యక్తి ఎండీఎంఎ డ్రగ్స్ ను స్కూల్ బ్యాగులో విజయవాడలో అందజేయాలని ఇచ్చాడని తెలిపారు.

Gujarat: గుజరాత్ తీరంలో భారీ స్థాయిలో పట్టుబడ్డ డ్రగ్స్.. విలువ రూ.425 కోట్లుపైనే

గతంలో కూడా విజయవాడలో డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు అనేకం ఉన్నాయి. భారీగా డ్రగ్స్ సరఫరా చేస్తూ దండగులు పట్టుబడ్డారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు ఏకంగా ఆర్టీసీ బస్సులోనే డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది.