కాణిపాకం ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ హోటల్ లో ఈ ప్రమాదం సంభవించింది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రధాన

  • Published By: veegamteam ,Published On : September 10, 2019 / 06:22 AM IST
కాణిపాకం ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ హోటల్ లో ఈ ప్రమాదం సంభవించింది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రధాన

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ హోటల్ లో ఈ ప్రమాదం సంభవించింది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రధాన ఆలయానికి దగ్గరలో బాలాజీ హోటల్‌ ఉంది. ఈ హోటల్ లో గ్యాస్ సిలిండర్ పేలింది. హోటల్‌ లోని నెయ్యి డబ్బాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. అగ్నిప్రమాదంతో భక్తులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల హోటళ్లల్లోని గ్యాస్ సిలిండర్లను పోలీసులు బయటకు తరలించారు. ఓ వైపు కాణిపాకం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం కలకలం రేపింది.

కాణిపాకయం వరసిద్ధి వినాయక స్వామి ప్రధాన ఆలయానికి సమీపంలో బాలాజీ హోటల్ ఉంది. అది మూడంతస్తుల భవనం. ఫస్ట్ ఫ్లోర్ లో హోటల్ ఉంది. పైన ఓ చిన్న ఇల్లు లాంటి ఉంది. ఇది హోటల్ కాకపోయినా అనధికారికంగా లడ్డూలు తయారుచేస్తున్నారు. వాటిని హోటల్ కి సరఫరా చేస్తారు. స్థానికంగా ఉండే ఆలయంలో అర్చకుడిగా పని చేసే వ్యక్తి లడ్డూలు తయారు చేసి వాటిని హోటల్ కి విక్రయిస్తుంటాడని స్థానికులు చెప్పారు. లడ్డూలు చేసే క్రమంలో నూనె, నెయ్యి ఎగిసి మంటలు చెలరేగాయని, గ్యాస్ సిలిండర్ పేలిందని చెబుతున్నారు. ప్రమాదం సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు.