Rajastan: గ్యాంగ్‭స్టర్ రాజు థెట్ దారుణ హత్య.. తామే చేశామని ఒప్పుకున్న లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్

ఈ ఘటన జరిగిన కాసేపటికే రోహిత్ గొదార అనే వ్యక్తి కాల్పులకు బాధ్యుడిని తానేనని, తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినంటూ ఫేస్‭బుక్ ద్వరా ప్రకటించాడు. ఆనంద్ పాల్ గ్యాంగ్‭కు చెందిన బల్బీర్ బనుదా హత్యలకు ప్రతీకారంగానే రాజును హతమార్చినట్లు రోహిత్ ప్రకటించాడు. జూలై 2014లో బికనీర్ జైలులో జరిగిన గొడవల్లో ఓ గ్యాంగ్ చేతిలో బనుదాను హత్య చేశారు.

Rajastan: గ్యాంగ్‭స్టర్ రాజు థెట్ దారుణ హత్య.. తామే చేశామని ఒప్పుకున్న లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్

Gangster Raju Theth shot in Rajasthan’s Sikar, Lawrence Bishnoi group claims responsibility

Rajastan: పశ్చిమ ఆసియా దేశాల్లో జరిగే పేలుళ్లు, హత్యలపై అక్కడి ఉగ్రవాద సంస్థలు బాధ్యత వహిస్తుంటాయి. అదేదో సమాజ సేవ చేసినట్లు ‘ఆ హత్యలు చేసింది మేమే చేశాం’ అని ఒప్పుకుంటాయి. ఇండియాలో పరిస్థితి అలాగే కనిపిస్తోంది. తాజాగా ఓ రౌడీ షీటర్‭ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా పట్టపగలే నడిరోడ్డుపై కాల్చి చంపారు. ఇది జరిగిన కాసేపటికే లారెన్స్ బిష్ణోయి గ్రూప్ స్పందిస్తూ, ఇది తాము చేసిన పనే అంటూ సమర్ధించుకోవడం గమనార్హం. దేశంలో ఇలాంటివి ఈ మధ్య కాలంలో అయితే లేవు. హత్యలు, నేరాలు జరుగుతున్నప్పటికీ తామే చేశామంటూ గర్వంగా చెప్పుకునే పరిస్థితి అయితే కనిపించదు. అయితే కొంత కాలంగా ఇలాంటి ప్రకటనలు వస్తుండడం ప్రజల్ని ఉలిక్కిపాటుకు గురి చేస్తోంది.

OYO Layoff Employees: ఒయోలో భారీ మార్పులకు శ్రీకారం.. ఇంటిబాట పట్టనున్న 10శాతం మంది ఉద్యోగులు

ఇక విషయంలోకి వస్తే.. రాజస్తాన్‭లో హై ప్రొఫైల్ గ్యాంగ్‭స్టర్‭గా పేరు గాంచిన రాజు థెట్ అనే వ్యక్తి శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. రాష్ట్రంలోని సికార్ నగరం పిప్రాలి రోడ్డులో ఉదయం 9:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు కురిపించిన బుల్లెట్ల వర్షానికి రాజు అక్కడికక్కడే కూలబడిపోయాడు. రాజుతో పాటు మరో వ్యక్తి సైతం ఈ కాల్పుల్లో మరణించాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఘటన జరిగిన కాసేపటికే రోహిత్ గొదార అనే వ్యక్తి కాల్పులకు బాధ్యుడిని తానేనని, తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినంటూ ఫేస్‭బుక్ ద్వరా ప్రకటించాడు. ఆనంద్ పాల్ గ్యాంగ్‭కు చెందిన బల్బీర్ బనుదా హత్యలకు ప్రతీకారంగానే రాజును హతమార్చినట్లు రోహిత్ ప్రకటించాడు. జూలై 2014లో బికనీర్ జైలులో జరిగిన గొడవల్లో ఓ గ్యాంగ్ చేతిలో బనుదాను హత్య చేశారు.

Reservations: 76 శాతానికి రిజర్వేషన్లను పెంచిన ఛత్తీస్‭గఢ్.. ఏయే వర్గానికి ఎంత కేటాయింపంటే?