Love : దూరం పెట్టాడని.. ప్రియుడిపై కాల్పులు జరిపిన ప్రియురాలు

తనను దూరం పెడుతున్నాడనే కోపంతో ఓ యువతి ప్రియుడిపై తుపాక్తితో కాల్పులు జరిపింది. బులెట్ గురి తప్పడంతో ప్రాణాలతో బయటపడ్డాడు

Love : దూరం పెట్టాడని.. ప్రియుడిపై కాల్పులు జరిపిన ప్రియురాలు

Love

Love : తనను దూరం పెడుతున్నాడనే కోపంతో ఓ యువతి ప్రియుడిపై తుపాక్తితో కాల్పులు జరిపింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పూర్వ బర్ధమాన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కేషియా గ్రామానికి చెందిన ఓ జంట గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లిన ఇద్దరు కలిసే వాళ్లెవారు. అయితే కొన్ని నెలల క్రితం యువతికి జార్ఖండ్ ఉద్యోగం రావడంతో ఆమె ఇక్కడికి షిఫ్ట్ అయింది. ఆమె ప్రియుడు ఊర్లోనే ఉంటున్నాడు.

చదవండి : Love Cheating : ప్రేమ…పెళ్లి పేరుతో లొంగదీసుకుని …..

ఉద్యోగానికి సెలవు పెట్టి ఈ నెల 14న గ్రామానికి వచ్చిన యువతి.. కేషియాలో ఉన్న ఓ సర్కస్ గ్రౌండ్‌లో కలుద్దామని చెప్పింది. దీంతో ఆమె చెప్పిన సమయానికి గ్రౌండ్ వద్దకు వచ్చాడు ప్రియుడు. అతడిని చూడగానే కౌగిలించుకున్న ఆమె యువకుడిపై ముద్దులు కురిపించింది. అనంతరం ఇద్దరు కలిసి సిగరెట్ తాగారు. అంతలోనే వెంట తెచ్చుకున్న తుపాకీతో అతడిపై కాల్పులు జరిపింది. బులెట్ గురితప్పి పొట్టలోకి దూసుకెళ్లడంతో ప్రయాణాపాయం తప్పింది. కాల్పులు జరిపిన వెంటనే యువతి అక్కడి నుంచి పారిపోగా.. రక్తపు గాయాలతో ఉన్న యువకుడు కేకలు వేశాడు.

చదవండి : Cine Love Couples: పీకల్లోతు ప్రేమలో ఉన్నా పెళ్లి మాత్రం ఇప్పుడే కాదు!

దీంతో స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు బాధితుడి నుంచి వివరాలు సేకరించి సదరు యువతిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆమెకి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై యువతిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అయితే ఆమెను కలవడం లేదనే కోపంతో తనపై కాల్పులు జరిపిందని తెలిపారు యువకుడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. యువతి నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు.