Raghunandan Rao Madhavaneni : దేశానికి రాహుల్ లాంటి పప్పు కావాలా..? మోడీ వంటి వీరుడు కావాలా?- రాజాసింగ్

బాంబులు పేలని ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హిందువులకు రక్షణ లేదు.

Raghunandan Rao Madhavaneni : దేశానికి రాహుల్ లాంటి పప్పు కావాలా..? మోడీ వంటి వీరుడు కావాలా?- రాజాసింగ్

Raghunandan Rao And Raja Singh (Photo Credit : Facebook)

Updated On : May 4, 2024 / 12:02 AM IST

Raghunandan Rao Madhavaneni : దేశానికి రాహుల్ గాంధీ లాంటి పప్పు కావాలో, దేశద్రోహులను తరిమివేసే మోడీ లాంటి వీరుడు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందువులకు రక్షణ లేదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రాపురం, భారత్ డివిజన్ లలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు.

దేశం మొత్తం మోడీ పాలన కోరుకుంటోంది-ఎమ్మెల్యే రాజాసింగ్
దుబ్బాక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రజల గళం విప్పిన రఘునందన్ ను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఆశీర్వదించాలి. చనిపోయిన పార్టీ బీఆర్ఎస్ లో చచ్చుబడిన వ్యక్తులు నిలబడ్డారు. కేసీఆర్ ఓ పెద్ద అబద్దాల కోరు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ కేసీఆర్ వల్లనే అప్పుల రాష్ట్రంగా మారింది. ప్రతి వ్యక్తి నెత్తి మీద అప్పు పెట్టిన ఘనత బీఆర్ఎస్ దే. దేశానికి రాహుల్ గాంధీ లాంటి పప్పు కావాలా? దేశద్రోహులను తరిమేసే మోడీ వంటి వీరుడు కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఇది.

మొన్నటివరకు ఎంఐఎంకు కేసీఆర్ నాన్న, ప్రస్తుతం రేవంత్ రెడ్డి. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ అవకాశవాది. రఘునందన్ వంటి వారిని పార్లమెంటుకు పంపిస్తే అసదుద్దీన్ ఒవైసీ వంటి వారి పప్పులు ఉడకవు. దేశం మొత్తం నరేంద్ర మోడీ పాలనను కోరుకుంటోంది.

కాంగ్రెస్ హయాంలో హిందువులకు రక్షణ లేదు- రఘునందన్ రావు
కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావు. 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. రేవంత్ రెడ్డి మాటలన్నీ మోసపూరితమైనవి. మహిళలకు మహాలక్ష్మి, ఫించన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పటికీ ఇవ్వలేదు. కేసీఆర్ కాళ్లు మొక్కిన వెంకట్రామిరెడ్డి రెడ్డి ఉచితంగా ఎమ్మెల్సీ అయిన ఓ అధికారి. భూకబ్జాదారుడిగా ముద్రపడిన వెంకట్రామిరెడ్డి 100కోట్లతో ప్రజలకు సేవ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు.

సర్పంచ్ క్యాడర్ వ్యక్తి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఓబీసీని ఓడగొట్టిన నీలంమధు ఒకే రోజు మూడు పార్టీలు మారిన వ్యక్తి. బాంబులు పేలని ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హిందువులకు రక్షణ లేదు. అయోధ్య రామమందిరం నిర్మాణం బీజేపీ హయాంలోనే సాధ్యమైంది. దేశం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ బీజేపీ ప్రభుత్వమే రావాలి.

Also Read : రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ గెలవాలి, రాహుల్ ప్రధాని కావాలి- సీఎం రేవంత్