Uttar Pradesh : ఛాటింగ్ వద్దన్నందుకు ఇయర్ ఫోన్ కేబుల్ తో తమ్ముడిని చంపేసింది

స్నేహితుడితో ఛాటింగ్ చేయవద్దని అన్నందుకు తమ్ముడిని ఇయర్ ఫోన్ కేబుల్ తో గొంతుకు బిగించి చంపేసిందో ఓ సోదరి.

Uttar Pradesh : ఛాటింగ్ వద్దన్నందుకు ఇయర్ ఫోన్ కేబుల్ తో తమ్ముడిని చంపేసింది

earphone cable

Earphone Cable : క్షణికావేశాలు అనర్థాలకు దారి తీస్తున్నాయి. స్నేహితుడితో ఛాటింగ్ చేయవద్దని అన్నందుకు తమ్ముడిని ఇయర్ ఫోన్ కేబుల్ తో గొంతుకు బిగించి చంపేసిందో ఓ సోదరి. అనంతరం మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా స్టోర్ రూమ్ లో పడేసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో చోటు చేసుకుంది. పోలీసుల విచారణలో నేరాన్ని బాలిక ఒప్పుకోవడంతో ఆమెను జువెనల్ హోమ్ కు తరలించారు.

రాయ్ బరేలిలో ఓ 15 ఏళ్ల బాలిక..స్నేహితుడితో ఛాటింగ్ చేస్తోంది. తల్లిదండ్రులు లేని సమయంలో ఫోన్ లో అబ్బాయితో మాట్లాడినట్లు ఆరోపణలున్నాయి. గురువారం కూడా తల్లిదండ్రులు లేని సమయంలో అదే అబ్బాయితో ఫోన్ లో మాట్లాడుతోంది. ఈ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఈ విషయాన్ని 9 సంవత్సరాలున్న సోదరుడు చూశాడు. పోన్ లో మాట్లాడవద్దని అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బాలుడు..సోదరిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

అనంతరం తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక..ఇయర్ ఫోన్ వైర్ తో గొంతుకు బిగించింది. ఊపిరాడకపోవడంతో బాలుడు చనిపోయాడు. అనంతరం స్టోర్ రూమ్ లో మృతదేహాన్ని పడేసింది. అదే రోజు రాత్రి కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం స్టోర్ రూమ్ నుంచి దుర్వాసన వస్తుండడంతో తలుపు తెరిచి చూడగా..ఒక్కసారిగా షాక్ తిన్నారు. కుమారుడు విగతజీవిగా కనిపంచడంతో పోలీసులకు సమాచారం అందించారు.

పొరుగున్న వారిపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అయితే..విచారణలో అతని తప్పు లేదని తేలింది. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు నమూనాలను సేకరించారు. అక్కడున్న వారికి పరీక్షలు నిర్వహించారు. బాలిక కడుపు, మెడ, చేతులపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలికను శిశు సంక్షేమ అధికారి, తల్లిదండ్రుల ఎదుట విచారించారు. నేరాన్ని అంగీకరించడంతో జువైనల్ హోమ్ కు తరలించారు.

Read More : YouTube channel : కాంగ్రెస్ పార్టీ యూ ట్యూబ్ ఛానెల్