YouTube channel : కాంగ్రెస్ పార్టీ యూ ట్యూబ్ ఛానెల్

కాంగ్రెస్ పార్టీ యూ ట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించింది. 2021, ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా...INC ఛానెల్ ను బుధవారం లాంచ్ చేసింది.

YouTube channel : కాంగ్రెస్ పార్టీ యూ ట్యూబ్ ఛానెల్

Congress Launche

Congress : పార్టీలు సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించుకుంటున్నాయి. వివిధ పార్టీలు సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్ లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. పలు వీడియోలను పోస్టు చేస్తూ..ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే యూ ట్యూబ్ ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఛానెల్ కు 3.67 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ యూ ట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించింది. 2021, ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి సందర్భంగా…INC ఛానెల్ ను బుధవారం లాంచ్ చేసింది.

రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ ఖర్గే, ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు నీరజ్ కుందన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవ్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో జర్నలిస్టుగా మహాత్మా గాంధీ పాత్రపై ఒక లఘు చిత్రాన్ని ప్రసారం చేసింది. 2021, ఏప్రిల్ 24వ తేదీన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని..లైవ్ కార్యక్రమాలను ప్రసారం చేస్తామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు. ప్రతిరోజు సుమారు 8 గంటల పాటు ప్రత్యక్ష కార్యక్రమాలు ఉంటాయని, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ప్రధాన మీడియా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పించింది. ఈ క్రమంలో…తమ వాయిస్ ను ప్రజలకు నేరుగా తెలియచేయడానికి సొంతంగా యూ ట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించామని వెల్లడించింది.

Read More : CM Uddhav Thackeray : 15 రోజులు కర్ఫ్యూ, 144 సెక్షన్..భోజనం ఫ్రీ, పేదలకు, ఆదివాసీలకు రూ. 2వేల ఆర్థిక సాయం