Student’s Suicide Note : అమ్మాయిలకు రక్షణ ఆ రెండు చోట్ల మాత్రమే..విద్యార్థిని సూసైడ్ నోట్

  చెన్నై సిటీ శివార్లలోని మంగాడులోని తన నివాసంలో 11వ తరగతి చదివే ఓ విద్యార్థిని శనివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే."తల్లి కడుపులో మరియు సమాధిలోనే ఓ అమ్మాయికి రక్షణ ఉంటుంది"

Student’s Suicide Note : అమ్మాయిలకు రక్షణ ఆ రెండు చోట్ల మాత్రమే..విద్యార్థిని సూసైడ్ నోట్

Sucide

Student’s Suicide Note :  చెన్నై సిటీ శివార్లలోని మంగాడులోని తన నివాసంలో 11వ తరగతి చదివే ఓ విద్యార్థిని శనివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.”తల్లి కడుపులో మరియు సమాధిలోనే ఓ అమ్మాయికి రక్షణ ఉంటుంది” అంటూ సూసైడ్ నోట్ రాసి..ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అంతేకాకుండా అమ్మాయిలను గౌరవించాలి అని ప్రతి ఒక్క పేరేంట్ తమ పిల్లలకు బోధించాలని ఆ సూసైడ్ నోట్ లో తెలిపింది.

స్కూల్ లో కూడా సేఫ్ కాదని,టీచర్లను కూడా నమ్మలేమని,మెంటల్ టార్చర్ కారణంగా తాను చదవలేకపోయానని,నిద్ర కూడా పట్టేది కాదని బాధితురాలు ఆ సూసైడ్ నోట్ లో పేర్కొంది. లైంగిక వేధింపులు ఆపాలని,తనకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపింది. అయితే ఓ యువకుడి వేధింపులు తట్టుకోలేకే ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో 21 ఏళ్ల కాలేజీ విద్యార్థిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పోస్క్ చట్టం కింద కేసు నమోదుచేశారు.

ఈ కేసుని విచారిస్తున్న ఓ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ..”మూడేళ్ల క్రితం ఈ యువకుడు,ఆ బాలిక ఒకే స్కూల్ లో చదివారు. ఆ తర్వాత బాధితురాలు గర్ల్స్ స్కూల్ కి వెళ్లిపోయింది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకి ఇన్ స్టాగ్రామ్ ద్వారా వీరిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. బాధితురాలైన మైనర్ బాలికతో తనకు భౌతిక సంబంధం ఉండేదని ఆ యువకుడు విచారణలో అంగీకరించాడు. గత రెండు వారాలుగా ఆ బాలికను యువకుడు వేధించాడు. మెసేజ్ లు,ఫొటోలు ద్వారా ఆ అమ్మాయిని మానసిక హింసకు గురిచేశాడు. ఇదంతా జరగకముందు గత ఎనిమిది నెలలుగా వీరిద్దరి మధ్య మంచి స్నేహపూర్వక రిలేషన్ షిప్ ఉండింది”అని తెలిపారు.

కాగా,గడిచిన కొన్ని వారాల్లో తమిళనాడులో నలుగురు విద్యార్థినులు లైంగిక వేధింపులు కారణమని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులోని ఇద్దరు.. తమ టీచర్లు లైంగిక వేధింపులకు పాల్పడటంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లో ఆరోపించారు. విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం తనను కలిచివేసిందని ఇటీవల సీఎం స్టాలిన్ ఓ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశారు. ఎవరూ ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని..ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా వాటి గురించి పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ చేయాలని,తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని స్టాలిన్ తెలిపారు.

ALSO READ Election Laws Bill : ఆధార్- ఓటర్ బిల్లుకు లోక్​సభ ఆమోదం