Hyderabad : మియాపూర్‌లో 27 కిలోల బంగారం స్వాధీనం

హైదరాబాద్ నగరంలో అధికారులు అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా మియాపూర్ వద్ద 27 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad : మియాపూర్‌లో 27 కిలోల బంగారం స్వాధీనం

Huge Gold And Silver Seized in Miyapur

Updated On : October 16, 2023 / 3:51 PM IST

Gold and silver seized in Miyapur Hyderabad : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. దీంతో సరైన దృవపత్రాలు లేకుండా బంగారం, వెండి, నగదు, విలువైన వస్తువులు వంటివి తరలింపులపై నిఘా పెట్టారు అధికారులు. అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెట్టారు. ఈ నిఘాల్లో ఇప్పటికే బంగారం, మద్యం, వెండి ఆభరణాలతో పాటు భారీగా నగదు పట్టుబడింది.

తాజాగా హైదరాబాద్ నగరంలో అధికారులు అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా మియాపూర్ వద్ద భారీగా బంగారం, వెండి పట్టుబడింది. 27 కిలోల బంగారం, 15 కిలోల వెండిని అధికారులు స్వాధీనం చేసుకునన్నారు. అనంతరం వాటిని సీజ్ చేశారు. బంగారం, వెండిని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా మరో వాహనంలో రూ.14 లక్షల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

Assembly Elections 2023 : ఓటర్లకు నోరూరించే స్వీట్ ఆఫర్, ఓటు వేస్తే జీలేబీలు ఫ్రీ .. ఎక్కడంటే .. ?

కాగా..ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు 148 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు, రవాణా శాఖ, కమిర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్ వంటి శాఖలు నిర్వహిస్తున్న సోదాల ద్వారా నగదు, మద్యం, డ్రగ్స్, బంగారం, వెండి ఆభరణాలు, ఇతర సామాగ్రి పట్టుబడుతున్నాయి.