Prostitution Racket : వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు

హైదరాబాద్ లో వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేసారు.

Prostitution Racket : వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు

Prostitution Racket

Prostitution Racket :  హైదరాబాద్ లో వేర్వేరు ప్రదేశాల్లో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు చేసారు. సికింద్రాబాద్  బౌధ్ధనగర్ కమ్యూనిటీ హాలు రోడ్డులోని ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో చిలకలగూడ  పోలీసులు దాడి చేసి  ఒకయువతికి విముక్తి   కల్పించి విటుడిని నిర్వాహాకులను అదుపులోకి తీసుకున్నారు.

కూకట్‌పల్లి కి చెందిన రేచల్ సోఫియా(50) అనే మహిళ నెల రోజుల క్రితం బౌధ్దనగర్ కమ్యూనిటీ హాల్   ఏరియాలో   ఒక ఇంటిని అద్దెకు తీసుకుంది. పద్మారావు నగర్ ఏషియన్ వైన్స్‌లో   పని చేసే    అప్పుల అనీల్(26) సాయంతో    అమ్మాయిలు, ఆంటీలను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆదివారం మధ్యాహ్నం   వ్యభిచార గృహంపై   దాడి చేసి ఓ యువతికి   విముక్తి కల్పించారు.  నిర్వాహకులరాలు రేచల్ సోఫియా, అనీల్ తోపాటు అత్తాపూర్ కు చెందిన విటుడు శ్రీశైలం (40)ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్దనుంచి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Also Read : Police lathi-charge: అనంతపురంలో విద్యార్థులపై విరిగిన లాఠీ.. విద్యార్థినికి పగిలిన తల

మరోక ఘటన మైలార్ దేవ్ పల్లిలో  జరిగింది. నిరుపేద మహిళలు, డబ్బులు అవసరమైన మహిళలను గుర్తంచి వారిని వ్యభిచారంలోకి దింపుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  మైలార్ దేవ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని వట్టెపల్లి మహమ్మదీయ కాలనీకి చెందిన షాబాన్ బేగం(37) గత కొంతకాలంగా పేదరికంలో ఉన్న అమ్మాయిలను  గుర్తించి వారిని    వ్యభిచార వృత్తిలోకి దింపుతోంది.   సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆదివారం ఆమె ఇంటిపై   దాడి చేసి బేగంను అదుపులోకి తీసుకుని రిమాండ్‌‌కు  తరలించారు.