Shinzo Abe Died : దుండగుడి కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి

పార్లమెంట్​ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగా వెనుక నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. షింజో అబే ఛాతీలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. 

Shinzo Abe Died : దుండగుడి కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి

Shinzo Abe

Updated On : July 8, 2022 / 3:16 PM IST

Shinzo Abe died : దుండగుడు జరిపిన కాల్పుల్లో జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతి చెందారు. కాల్పుల్లో తీవ్ర గాయాలైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన షింజో అబే ప్రాణాలు విడిచినట్లు జపాన్ మీడియా ప్రకటించింది. వెస్టరన్ జపాన్ లో శుక్రవారం ఉదయం షింజో అబేపై దుండగుడు కాల్పులు జరిపాడు.

Shinzo Abe : ‘నా ప్రియ మిత్రుడు’అంటూ..జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేపై దాడి ఖండించిన ప్రధాని మోడీ

సభలో ప్రసంగిస్తుండగా షింజోపై దుండుగుడు కాల్పులు జరిపాడు. ఉదయం 8 గంటల 29 నిమిషాల సమయంలో షింజో పై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. పార్లమెంట్​ ఎగువ సభకు ఆదివారం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నరా ప్రాంతంలోని ఓ వీధిలో అబే ప్రసంగిస్తుండగా వెనుక నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు.

షింజో అబే ఛాతీలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. కాల్పులు జరిపన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జపాన్​కు సుదీర్ఘకాలంగా ప్రధానిగా అబే పని చేశారు. 2020లో ఆరోగ్య కారణాలతో ప్రధాని పదవి నుంచి అబే తప్పుకున్నారు.