Shinzo Abe : ‘నా ప్రియ మిత్రుడు’అంటూ..జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేపై దాడి ఖండించిన ప్రధాని మోడీ

జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేపై దాడిని భారత్ ఖండించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ట్వీట్ లో ప్రధాని షింజో అబే నా ప్రియ మిత్రుడు అంటూ పేర్కొన్నారు. “నా ప్రియ మిత్రుడు అబే షింజోపై జరిగిన దాడితో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. అంటూ.. Modi పేర్కొన్నారు.

Shinzo Abe : ‘నా ప్రియ మిత్రుడు’అంటూ..జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేపై దాడి ఖండించిన ప్రధాని మోడీ

Japan's Former Pm Shinzo Abe After Shooting..pm Modi's 'most Dependable Friend'

Shinzo Abe : జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేపై దాడిని భారత్ ఖండించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ట్వీట్ లో ప్రధాని షింజో అబే నా ప్రియ మిత్రుడు అంటూ పేర్కొన్నారు. “నా ప్రియ మిత్రుడు అబే షింజోపై జరిగిన దాడితో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. తామంతా అతని కుటుంబంతో..జపాన్ ప్రజలతో ఉన్నాం’’ అంటూ.. ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపైకు భారత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. షింజో అబే నరేంద్రమోదీకి మిత్రుడు. గత ఏడాది షింజోను పద్మవిభూషణ్‌తో సత్కరించింది భారత ప్రభుత్వం. ఈ ఇద్దరు నేతల మధ్య వ్యక్తి స్నేహం కూడా ఉంది. షింజో అబే ప్రధానమంత్రిగా భారతదేశానికి వచ్చినప్పుడు.. షింజో అబే వారణాసి దర్శనానికి ప్రధాని మోడీ తీసుకెళ్లారు. ఇద్దరు దేశాధినేతలు కలిసి గంగా హారతిలో పాల్గొన్నారు. ఈ సమయంలో భారతీయ సంస్కృతి, నాగరికత పట్ల షింజో అబే తన ఆప్యాయత వెల్లడించారు.

షింజో అబే భారతీయ సంప్రదాయాలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తనకు అత్యంత విశ్వసనీయ స్నేహితుల్లో నరేంద్ర మోదీ ఒకరు అని గతంలో చాలాసార్లు జపాన్ ప్రధాని షింజో అబే ప్రకటించిన సంగతి తెలిసిందే. షింజో అబే భారతదేశం నుంచి బయలుదేరుతూ.. తనకు మంచి స్నేహితుడు అంటే ప్రధాని మోదీ అని అన్నారు. ఈ సందర్భంలో షింబో అబేకు ప్రధాని నరేంద్ర మోడీ భగవద్గీతను అందించారు. అంతేకాదు ప్రధాని మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో కూడా అనేకసార్లు జపాన్ కు వెళ్లారు. అబేతో పలు చర్చలు జరిపారు. ఆ తరువాత అదే స్నేహాన్ని కొనసాగించారు. మోడీ ప్రధాని అయిన తరువాత కూడా అబే భారత్ తో మరింత సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. అలా ఆ బంధం ఎప్పటికి ఉంటుందని ఇరువురు వెల్లడించుకునేవారు.

Also read : Shinzo Abe: విషమంగా జపాన్ మాజీ పీఎం పరిస్థితి

జపాన్ లో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డు షింజోది. 2006లో ఏడాది పాటు అబే ప్రధానమంత్రి పదవిలో కొనసాగారు. 2012 నుంచి 2020 వరకు కూడా ఆయన ఈ పదవిలో ఉన్నారు. జపాన్ ప్రధానమంత్రి పదవికి షింజో అబే 2020 ఆగస్టు 28న రాజీనామా చేశారు. కొన్ని సంవత్సరాలుగా అబే దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన అనారోగ్యం ప్రభుత్వానికి సమస్యలు సృష్టించొద్దనే కారణంతోనే ఆయన రాజీనామా చేశారు. అల్సరేటివ్ కొలిటిస్ వ్యాధితో కొన్ని ఏళ్లుగా పోరాడుతున్న అబే.. సుదీర్ఘ కాలం ప్రీమియర్‌గా పని చేసిన నేతగా.. 50 ఏళ్ల క్రితం తన తాత ఇసాకు సాటో క్రియేట్ చేసిన రికార్డును ఆయన బ్రేక్ చేశారు.

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేకు నేతాజీ అవార్డ్
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి పురస్కరించుకుని నేతాజీ అవార్డు 2022ను ప్రకటించింది నేతాజీ రీసెర్చ్‌ బ్యూరో. జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబేకు ఈ అవార్డ్ ను ప్రధానం చేసింది. ఈ మేరకు కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్‌ లో ఉన్న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నివాసంలో వర్చువల్‌ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ అవార్డును అందించారు. కోల్‌కతాలోని జపాన్‌ కాన్సుల్‌ జనరల్ నకమురా యుటాకా.. అబే తరపున ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా.. షింబో అబే మాట్లాడుతూ.. ఈ అవార్డ్ రావడం గర్వంగా ఉందని.. తెలిపారు.

Also read : Shinzo Abe: జపాన్ మాజీ ప్రధానిపై కాల్పులు, నారా సిటీకి తరలింపు

ఎన్నికల ప్రచారంలో ఉండగా కాల్పులు..
జపాన్‌లో ఎగువసభకు మరోకొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నరాలో షింజో అబే ప్రచారం చేస్తున్న సమయంలో ఓ దుండుగుడు కాల్పులకు దిగాడు. ఇలాంటి సమయంలో మాజీ ప్రధానిపై కాల్పులకు దిగడం కలకలం రేపింది.

జపాన్‌లో అత్యంత తుపాకీ నియంత్రణ చట్టాలు..
జపాన్‌లో అత్యంత తుపాకీ నియంత్రణ చట్టాలున్నాయి. జపాన్ లో తుపాకీ లైసెన్స్ పొందాలంటే చాలా చాలా కష్టతరం. దీంట్లో భాగంగా మొదట షూటింగ్ అసోసియేషన్ నుంచి సిఫారసును పొందాలి. ఆ తర్వాత పోలీసులు కఠినమైన నిబంధనలను దాటుకొని తుపాకీ లైసెన్స్ ను పొందుతారు. కానీ సదరు దుండగుడికి తుపాకీ ఎక్కడనుంచి వచ్చింది? కాల్పులకు గల కారణాలు ఏమిటి?అనే పలు కీలక అంశాలపై దర్యాప్తు సాగుతోంది.

విషమంగా షింజో అబే ఆరోగ్య పరిస్థితి
మాజీ ప్రధాని అబేను నారాలో ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కాల్పులు జరిగాయి. షూటర్‌గా భావిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది” అని జపాన్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ హిరోకాజు మట్సునో చెప్పారు.