Lemon Scam : నిమ్మకాయల కుంభకోణం-జైలు సూపరింటెండెంట్‌ను పట్టిచ్చిన ఖైది

ప్రభుత్వ  సొమ్ము అప్పనంగా కొట్టేయాలనుకుంటే ఏదో ఒకమార్గం  ఆలోచిస్తారు కొందరు.  అందుకు  వారి దగ్గర మాస్టర్ ప్లాన్ లు  ఉంటాయి.

Lemon Scam : నిమ్మకాయల కుంభకోణం-జైలు సూపరింటెండెంట్‌ను పట్టిచ్చిన ఖైది

Kapurthala Lemon Scam

Lemon Scam :  ప్రభుత్వ  సొమ్ము అప్పనంగా కొట్టేయాలనుకుంటే ఏదో ఒకమార్గం  ఆలోచిస్తారు కొందరు.  అందుకు  వారి దగ్గర మాస్టర్ ప్లాన్ లు  ఉంటాయి. ఎండాకాలం  అడ్డం పెట్టుకుని  జైలు ఖైదీల పేరుతో ఒక పదివేల రూపాయలు అవినీతి చేయాలనుకుని అడ్డంగా బుక్కైపోయాడు  జైలు సూపరింటెండెంట్.

పంజాబ్ లోని  కపుర్తలా మోడరన్ జైలు సూపరింటెడెంట్ గా విధులు నిర్వహిస్తున్న గుర్నమ్ లాల్ కు చెడు ఆలోచన వచ్చింది.  ప్రభుత్వ సొమ్ము ఎలా కొట్టేయాలా అనుకున్నాడు.  ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి.  దానితో పాటు నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటాయి.  ఇంకేముంది జైలులో ఖైదీలకు రోజూ  నిమ్మకాయ నీళ్లు ఇస్తున్నట్లు  బిల్లులు పుట్టించాడు.

ఏప్రిల్ 15-30 తేదీల మధ్య జైలులో   50 కిలోల నిమ్మకాయలు ఉపయోగించామన్నాడు.  వాటికి కిలో రూ.200 చొప్పున రూ.10వేలకు   కొనుగోలు చేసామని ప్రభుత్వానికి బిల్లులు పంపించాడు.  అయితే గుర్నమ్ లాల్ ఇలాంటి బిల్లు పెడుతున్నాడని తెలుసుకున్న  ఖైదీ ఒకరు ఈ విషయమై   రాష్ట్ర  జైళ్ల శాఖ   మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ కు ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదుతో మంత్రి విచారణకు ఆదేశించారు.  అవన్నీ తప్పుడు బిల్లులని, అసలు జైలులో ఉన్నస్టాక్ కు బిల్లులకు పొంతన లేదని విచారణలో తేలింది. నిబంధనల ప్రకారం ఖైదీలకు ఆహారం అందించటం లేదని నిమ్మకాయల కుంభకోణానికి పాల్పడినట్లు తేల్చారు.  దీంతో ప్రభుత్వం జైలు సూపరింటెండెంట్ గుర్నమ్ ను సస్పెండ్ చేసి…చర్యలు తీసుకోవాలని అధికారులును అదేశించింది.

Also Read : Crime news: రాజస్థాన్‌లో దారుణం.. 13 ఏండ్ల బాలికపై..