Kerala : విడాకుల విషయంలో కోర్టు తీర్పుపై ఆగ్రహం.. ఏకంగా జడ్జి కారునే ధ్వంసం చేసిన వ్యక్తి

అయితే, ఆ కోర్టు తీర్పుపై తనకు నమ్మకం లేదని వ్యక్తి కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హైకోర్టు వారి కేసును ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం కోర్టు కేసు విచారణ చేపట్టింది.

Kerala : విడాకుల విషయంలో కోర్టు తీర్పుపై ఆగ్రహం.. ఏకంగా జడ్జి కారునే ధ్వంసం చేసిన వ్యక్తి

judge car destroy

Man Destroy Judge Car : కేరళలో ఓ వ్యక్తి ఏకంగా జడ్జి కారుపైనే దాడికి పాల్పడ్డాడు. విడాకుల వ్యవహారానికి సంబంధించి కోర్టు తీర్పుతో అసంతృప్తి చెందిన వ్యక్తి ఏకంగా జడ్జి కారును ధ్వంసం చేశాడు. పథనంతిట్ట జిల్లా తిరువళ్లా కోర్టు దగ్గర బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2017లో దంపతులు విడాకుల కోసం పథనంతిట్ట కోర్టుకు వెళ్లారు.

అయితే, ఆ కోర్టు తీర్పుపై తనకు నమ్మకం లేదని వ్యక్తి కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హైకోర్టు వారి కేసును ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం కోర్టు కేసు విచారణ చేపట్టింది. అయితే, కోర్టులో తనకు న్యాయం జరుగలేదని కోపంతో రగిలిపోయాడు. దీంతో కోర్టు ఆవరణలో నిలిపి ఉంచిన జడ్జి కారును ధ్వంసం చేశాడు.

Budde Kantarao : కోదాడ గేట్ ఇంజనీరింగ్ కాలేజీ ఓనర్ పై హత్యాయత్నం.. హత్య కోసం సుపారీ ఇచ్చిన కాలేజీ భాగస్వాములు

పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై ఆరేళ్లుగా కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. భార్యే అతడిపై విడాకుల పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. కాగా, న్యాయవాది, జడ్జి కలిసి తన గోడును సరిగా వినిపించుకోలేదన్న కోపంతో వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు.