దారుణం.. స్మార్ట్ ఫోన్ కోసం కొట్టి చంపేశారు

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో దారుణం జరిగింది. స్మార్ట్ ఫోన్ కోసం ఓ వ్యక్తిని కొట్టి చంపేశారు. మీ పిల్లాడు మా ఫోన్ ని డ్యామేజ్ చేశారని ఆరోపిస్తూ.. ఎదురింట్లో నివాసముండే

  • Edited By: veegamteam , February 24, 2020 / 08:17 PM IST
దారుణం.. స్మార్ట్ ఫోన్ కోసం కొట్టి చంపేశారు

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో దారుణం జరిగింది. స్మార్ట్ ఫోన్ కోసం ఓ వ్యక్తిని కొట్టి చంపేశారు. మీ పిల్లాడు మా ఫోన్ ని డ్యామేజ్ చేశారని ఆరోపిస్తూ.. ఎదురింట్లో నివాసముండే

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో దారుణం జరిగింది. స్మార్ట్ ఫోన్ కోసం ఓ వ్యక్తిని కొట్టి చంపేశారు. మీ పిల్లాడు మా ఫోన్ ని డ్యామేజ్ చేశారని ఆరోపిస్తూ.. పక్కింటోళ్లు పిల్లాడి తండ్రిని ఐరన్ రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. మాల్దా జిల్లాలో ఈ ఘోరం జరిగింది. మృతుడిని అలీముల్ షేక్ గా పోలీసులు గుర్తించారు.

అలీముల్ షేక్, మల్లా బకాస్ ఎదురెదురు ఇళ్లలో నివాసం ఉంటారు. మల్లా బకాస్ మనవడు, అలీముల్ షేక్ ఏడేళ్ల కొడుకు స్మార్ట్ ఫోన్ తో ఆడుకుంటున్నారు. ఆ స్మార్ట్ ఫోన్ మల్లా బకాస్ ది. కాసేపటి తర్వాత ఏం జరిగిందో కానీ.. ఫోన్ పగిలిపోయి ఉంది. ఇది గమనించిన మల్లా బకాస్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన ఫోన్ పగలకొట్టింది అలీముల్ షేక్ కొడుకే అని ఆరోపిస్తూ.. అలీముల్ షేక్ ఇంట్లోకి దూసుకెళ్లాడు. అల్లా బకాస్ అతడి కొడుకులు, కూతుర్లు షేక్ ఇంట్లోకి వెళ్లారు. ఐరన్ రాడ్లు, కర్రలతో షేక్ ని అంతా కలిసి చావబాదారు. నీ కొడుకే నా స్మార్ట్ ఫోన్ చెడగొట్టాడు అని ఆరోపించారు. 

ఇది గమనించిన షేక్ సోదరుడు.. వెంటనే షేక్ ఇంట్లోకి వెళ్లాడు. అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. షేక్ రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించాడు. కానీ ఫలితం లేకపోయింది. తీవ్రగాయాలు కావడం, రక్తం బాగా పోవడంతో షేక్ చనిపోయాడు. మృతుడి కుటుంబసభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్లా బకాస్ తో పాటు అతడి కుటుంబానికి చెందిన నలుగురిపై కేసు పెట్టారు. ఈ ఘటన తర్వాత అల్లా బకాస్ కుటుంబం పరారీలో ఉంది. రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. 

వేల రూపాయలు కూడా ఖరీదు చేయని ఓ స్మార్ట్ ఫోన్ కోసం.. ఓ మనిషిని కొట్టి చంపేడయం సంచలనం రేపింది. ఈ ఘటన స్థానికులను షాక్ కి గురి చేసింది. నిజానిజాలు తెలుసుకోకుండా ఆవేశంతో ఓ నిండు ప్రాణం తీశారని వాపోయారు. కొత్త ఫోన్ కొనివ్వమని అడిగుంటే సరిపోయేదన్నారు. కానీ ఇలా దాడి చేసి చంపేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఓ ఫోన్ కోసం ఓ మనిషిని పొట్టనపెట్టుకున్న అల్లా బకాస్ అతడి కుటుంబసభ్యులను కఠినంగా శిక్షించాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేశారు.