Hyderabad : పరారీలో సీఐ నాగేశ్వరరావు-గాలిస్తున్న పోలీసులు

మహిళపై అత్యాచారం చేసి ఆమెను,ఆమె భర్తను కిడ్నాప్ చేసిన ఘటనలో కేసు నమోదైన మారేడ్ పల్లి సీఐ నాగేశ్వర రావు తప్పించుకు తిరుగుతున్నారు. వ

Hyderabad : పరారీలో సీఐ నాగేశ్వరరావు-గాలిస్తున్న పోలీసులు

Maredpalli Ci Nageswara Rao

Hyderabad :  మహిళపై అత్యాచారం చేసి ఆమెను,ఆమె భర్తను కిడ్నాప్ చేసిన ఘటనలో కేసు నమోదైన మారేడ్ పల్లి సీఐ నాగేశ్వర రావు తప్పించుకు తిరుగుతున్నారు. వనస్ధలిపురం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు కాగానే అదుపులోకి తీసుకోటానికి రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు ఆయన వద్దకు వచ్చారు. అప్పటికి ఆయన డ్యూటీలో ఉన్నారు.

తాను రాత్రి డ్యూటీలో ఉన్నానని, రేపు ఉదయం వచ్చి లొంగిపోతానని ఎస్‌ఓటీ పోలీసులకు చెప్పి పంపించి వేశారు. రాత్రి 12-15 కు నార్త్ జోన్ పోలీసులు ఫోన్ చేయగామొబైల్ స్విఛ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లి పోయారు. రెండు రోజులగా పోలీసులకు అందుబాటులోకి రాకపోవటంతో నాగేశ్వర రావును పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి గాలిస్తున్నాయి.

వనస్ధలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో నివాసం ముండే మహిళపై ఈ నెల 7వ తేదీన రాత్రి 12 గంటలకు సీఐ నాగేశ్వరరావు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అడ్డొచ్చిన ఆమె భర్తను గన్ తో బెదిరించాడు. అనంతరం దంపతులను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు.

అయితే ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్ద కారుకు యాక్సిడెంట్ కావడంతో బాధితులు తప్పించుకుని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారుకి ప్రమాదం జరగకుండా ఉంటే తమను సీఐ చంపేసి ఎక్కడో చోట పడేసేవాడని బాధితులు వాపోయారు. నాగేశ్వరరావుపై 8వ తేదీ తెల్లవారు ఝామున కేసు నమోదయ్యింది.

Also Read : CI Nageswara Rao : వివాహితపై అత్యాచారం కేసు.. కీచక ఖాకీపై సస్పెన్షన్ వేటు