Medico Preeti Case : మెడికో ప్రీతి మృతి కేసులో మరో కీలక ఆధారం లభ్యం

డాక్టర్ ప్రీతి మృతి కేసులో మట్టెవాడ పోలీసులకుత మరో కీలక ఆధారం లభ్యం అయింది. ప్రీతి లాస్ట్ ఫోన్ కాల్ పై పూర్తి స్థాయి సమాచారం సేకరిస్తున్న దర్యాప్తు బృందం అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఓ జూనియర్ డాక్టర్ ఇచ్చిన సమాచారంతో కస్టడీలో నిందితుడు సైఫ్ చెప్పిన వాదన అవాస్తమనే అంచనాకు పోలీసులు వస్తున్నారు.

Medico Preeti Case : మెడికో ప్రీతి మృతి కేసులో మరో కీలక ఆధారం లభ్యం

MEDICO PREETI

Updated On : March 5, 2023 / 5:55 PM IST

Medico Preeti Case : డాక్టర్ ప్రీతి మృతి కేసులో మట్టెవాడ పోలీసులకుత మరో కీలక ఆధారం లభ్యం అయింది. ప్రీతి లాస్ట్ ఫోన్ కాల్ పై పూర్తి స్థాయి సమాచారం సేకరిస్తున్న దర్యాప్తు బృందం అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఓ జూనియర్ డాక్టర్ ఇచ్చిన సమాచారంతో కస్టడీలో నిందితుడు సైఫ్ చెప్పిన వాదన అవాస్తమనే అంచనాకు పోలీసులు వస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో జూనియర్ డాక్టర్ వాంగ్మూలం కీలకంగా మారనుంది. అటు యాంటీ ర్యాగింగ్ కమిటీ.. ఇటు పోలీసుల విచారణలో ప్రీతి జూనియర్ కీలక విషయాలు వెల్లడించారు.

పీఏసీ రిపోర్టు వివాదంలో నిందితుడు సైఫ్ అభిప్రాయానికి జూనియర్ మెడికో భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రీ అనస్థీషియా రిపోర్టు విషయంలో డాక్టర్ ప్రీతిని డాక్టర్ సైఫ్ బ్లేమ్ చేసినట్లు నిర్ధారణ అయింది. గవర్నమెంట్ మెటర్నరీ ఆస్పత్రిలో జూనియర్ కు డిక్టేట్ చేస్తూ ప్రీతి పీఏసీ రిపోర్టు పొందుపర్చడంతో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఇదే అంశం పీఏసీ రిపోర్టు విషయంలో సైఫ్ వాదన అవాస్తమని రుజువు చేస్తోంది. డా.సైఫ్ తనను కావాలనే వేధిస్తున్నాంటూ ప్రీతి వాపోయారు.

Medico Preeti Case : మెడికో ప్రీతి ర్యాగింగ్ కు గురైనట్లు నిర్ధారణ.. సైఫ్ మెంటల్ గా వేధించినట్లు తేల్చిన కమిటీ

పీఏసీ రిపోర్టు వివాదం విచారించి తనకు సపోర్టు చేయాలని వేడుకున్నారు. తనపై కుట్ర జరుగుతోందని ప్రీతి మానసిక సంఘర్షణకు గురయ్యారు. తనపై జరుగుతున్న కుట్రకు సంబంధించి లాస్ట్ కాల్ లో సహా విద్యార్థితో ప్రీతి ఆవేదన వ్యక్తం చేశారు. డా.సైఫ్, డా.ప్రీతి మధ్య ప్రశ్నించేతత్వానికి సంబంధించిన చాట్స్ కూడా లభ్యమయ్యాయి. మొబైల్ డేటా, సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ ఆధారాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మెడికో ప్రీతిది ఆత్మహత్యా? లేదా హత్య అనే విషయంపై మిస్టరీ వీడలేదు. హైదరాబాద్ ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ నుంచి వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందింది. ఈ రిపోర్టు ఆధారంగా ప్రీతిది ఆత్మహత్యా? హత్యా? దానిపై పోలీసులు నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రీతి డెత్ కేసులో కప్టడీలో ఉన్న నిందితుడు సైఫ్ ను పోలీసులు నాలుగో రోజు ప్రశ్నిస్తున్నారు. సైఫ్ ను అతను చెబుతున్న వివరాల ఆధారంగా మరికొంత మందిని ప్రశ్నిస్తుండే సరికి ప్రీతి డెత్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.

Medico Preethi Case : మెడికో ప్రీతి కేసు.. కేఎంసీ అనస్థీషియా హెచ్ఓడీపై వేటు

పీఏసీ రిపోర్టు వివాదంలో డా.స్మృతి అభిప్రాయం ఇందులో కీలకంగా మారింది. డా.స్మృతితోపాటు మరో ముగ్గురిని ప్రశ్నించిన పోలీసులు పీఏసీ రిపోర్టు వివాదానకి కారణాలను తెలుసుకున్నారు. సైఫ్ వేధింపులపై ఫిర్యాదు చేశాక..ఎంజీఎం హెచ్ వోడీ కౌన్సిలింగ్ చేస్తుండగా ప్రీతి కన్నీరు పెట్టినట్లు పోలీసులతో చెప్పారు. ఎల్ డీడీ-నాకౌట్స్ గ్రూపులో తనన సపోర్టు చేయాలని మెడికోలను ప్రీతి వేడుకున్నట్లు గుర్తించారు. అటు ప్రీతి లాస్ట్ కాల్ పై పూర్తిస్థాయి సమాచారాన్ని దర్యాప్తు బృందం సేకరిస్తోంది.

సోదరి పెళ్లికి ప్రీతి సెలవు పెట్టినా అబ్సెంట్ వేయడంపై ఫోకస్ పెట్టారు. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సరిపోల్చుతూ సీపీ రంగనాథ్ విచారణను పర్యవేక్షిస్తున్నారు. డేటా అనలిస్టులు, ఫోరెన్సిక్ టీమ్, విచారణ బృందం ఇన్ పుట్స్ ను సీపీ రంగనాథ్ పరిశీలిస్తున్నారు. ఎఫ్ ఎస్ఎల్, టాక్సికాలజీ రిపోర్టులను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడు సైఫ్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

Medico Preeti Case : మెడికో ప్రీతి ర్యాగింగ్ కు గురైనట్లు నిర్ధారణ.. సైఫ్ మెంటల్ గా వేధించినట్లు తేల్చిన కమిటీ

నాలుగో రోజు అతడిని విచారిస్తున్నారు. సైఫ్ నుంచి అనేక వివరాలు రాబడుతున్నారు. శనివారం(మార్చి4,2023) సాయంత్రం డాక్టర్ ప్రీతి ఘటనపై పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందింది. అందులోని సారాంశం గురించి పోలీసులకు బ్రీఫ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రీతి కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకంగా మారనుంది. ఎఫ్ఎస్ఎల్ నివేదికలో ఏముంది? అనేది చర్చనీయాంశంగా మారింది.