Hijab Row: బుర్ఖా వేసుకోను అన్నందుకు హిందూ భార్యను హతమార్చిన భర్త

తనకు విడాకులు కావాలని రూపాలి డిమాండ్ చేస్తుండడంతో ఈ విషయమై చర్చించడానికి సెప్టెంబర్ 26 (సోమవారం)న వీరు కలుసుకున్నారు. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో మరోసారి బుర్ఖా విషయమై గొడవ మొదలైంది. బుర్ఖా ధరించాల్సిందేనంటూ ఇక్బాల్ ఒత్తిడి చేశాడు. అయితే అందుకు రూపాలి ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఒక సంధులోకి లాగి కత్తితో పలుమార్లు పొడిచాడు

Hijab Row: బుర్ఖా వేసుకోను అన్నందుకు హిందూ భార్యను హతమార్చిన భర్త

Mumbai man kills Hindu wife for refusing to wear burqa

Hijab Row: బుర్ఖా (హిజాబ్) వేసుకోలేదని భార్యను హతమార్చాడు ఒక వ్యక్తి. ఈ విషయమై సోమవారం రాత్రి వారి కుమారుడి సమక్షంలోనే ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. నిష్ట ఇస్లాం సంప్రదాయాల్ని పాటించడానికి భార్య అంగీకరించలేదు. దీంతో తీవ్ర కోపానికి గురైన ఆ వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. నిజానికి ఈ బర్ఖా విషయం మీదే గొడవై కొద్ది రోజుల క్రితమే వీరు విడిపోయారు. అయితే తాజాగా విడాకులకు సంబంధించిన విషయమై కలుసుకుని మాట్లాడుకునే సందర్భంలో ఇది జరిగింది.

నిందితుడి పేరు ఇక్బాల్ షైక్(36). టాక్సీ నడుపుతుంటాడు. బాధితురాలి పేరు రూపాలి(20). ఈమె హిందూ మహిళ. 2019లో ఇక్బాల్‭ను వివాహం చేసుకున్న అనంతరం జరాగా పేరు మార్చుకుంది. 2020లో వీరికి ఒక కుమారుడు పుట్టాడు. ముంబైలో నివాసం ఉంటారు. కాగా రూపాలి బుర్ఖా ధరించాలంటూ ఇక్బాల్ కుటుంబం ఒత్తిడి తీసుకువచ్చింది. ఇక్బాల్ సైతం ఈ విషయంలో మొండిగా వ్యవహరించడంతో కొద్ది రోజుల క్రితమే వీరు విడిపోయారు.

కాగా, తనకు విడాకులు కావాలని రూపాలి డిమాండ్ చేస్తుండడంతో ఈ విషయమై చర్చించడానికి సెప్టెంబర్ 26 (సోమవారం)న వీరు కలుసుకున్నారు. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో మరోసారి బుర్ఖా విషయమై గొడవ మొదలైంది. బుర్ఖా ధరించాల్సిందేనంటూ ఇక్బాల్ ఒత్తిడి చేశాడు. అయితే అందుకు రూపాలి ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఒక సంధులోకి లాగి కత్తితో పలుమార్లు పొడిచాడు. కత్తిగాట్లు బలంగా దిగడంతో రూపాలి అక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇక్బాన్‭ను అరెస్ట్ చేసి 302 కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Kolar: గుడి మీద నీలి జెండా ఎగరేసిన అంబేద్కరిస్టులు.. దళిత కుటుంబానికి రూ.60 వేలు ఫైన్ వేయడంపై రియాక్షన్ ఇది