karate Kalyani : కొత్త వివాదంలో కరాటే కళ్యాణి

యూ ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిన  వివాదంలో చిక్కుకున్న సినీ నటి కరాటే కళ్యాణి ఇప్పుడు మరోక కొత్త వివాదంలో చిక్కుకున్నారు.

karate Kalyani : కొత్త  వివాదంలో కరాటే కళ్యాణి

Karate Kalyani

karate Kalyani : యూ ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసిన  వివాదంలో చిక్కుకున్న సినీ నటి కరాటే కళ్యాణి ఇప్పుడు మరోక కొత్త వివాదంలో చిక్కుకున్నారు. ఆమె నిబంధనలకు విరుధ్దంగా ఒక చిన్నారిని దత్తత తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈవిషయమై విచారణ జరిపేందుకు చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆమె ఇంటికి చేరుకున్నారు.

అయితే కరాటే కళ్యాణి ఇంట్లో లేకపోవటం… అధికారుల వెంట మహిళా పోలీసులు లేకపోవటంతో అధికారులు  పోలీసుల సహాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. మహిళా పోలీసులు రాగానే వారు ఇంటిలోకి వెళ్లి ఈవిషయమై విచారించనున్నారు.

పలువురు చిన్నారులను కిడ్నాప్ చేయటంతో పాటు… 2 నెలల పిల్లలను కొనుగోలు చేసినట్లు కరాటే కళ్యాణిపై ఆరోపణలు వచ్చాయి. చిన్నపిల్లలను అడ్డుపెట్టుకుని డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆమెపై ఫిర్యాదు అందింది. దీంతో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్‌లో ఉన్న కరాటే కళ్యాణి ఇంటికి చేరుకున్నారు.

కళ్యాణి, యూ ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడికి పాల్పడటం, అనంతరం ఇరువురిపై పోలీసులు కేసులు నమోదు చేయటం జరిగింది. ఈనేపధ్యంలో ట్విట్టర్ వేదికగా మరికొందరు కళ్యాణి బాధితులు బయటకు వచ్చారు. శ్రీకాంత్ రెడ్డితో వివాదం జరుగుతున్నప్పుడు కరాటే కళ్యాణి వద్ద చిన్నారి పాప ఉంది.   ఇప్పుడు కరాటే కళ్యాణి వద్ద ఉన్న చిన్నారిని దత్తత తీసుకున్న అంశంలో చైల్డ్ వేల్పేర్ అధికారులు విచారించనున్నారు.

కాగా…. ఈవిషయమై కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మి దత్తతకు సంబంధించిన  వివరాలు అందించారు. గతంలో   ఒక బాబును తీసుకు వచ్చి పెంచుకుంటున్నామని ఆ బాబుకు ఇప్పుడు  12 ఏళ్లు అని…. ఆ అబ్బాయిని శ్రీకాకుళం నుంచి తీసుకువచ్చామని… ఇప్పుడు  మరోక పాపను పెంచుకుంటోందని తల్లి తెలిపారు. ఆపాప డిసెంబర్ 25న పుట్టిందని…డిసెంబర్ 28న కళ్యాణి ఇంటికి తీసుకు వచ్చిందని… ఇదంతా చట్ట బధ్దంగానే జరిగిందని ఆమె తెలిపారు.