Online Loan Apps Harassment : తీసుకుంది రూ.2వేలు, కట్టింది రూ.15వేలు, అయినా న్యూడ్ ఫొటోలతో వేధింపులు.. లోన్ యాప్స్ దారుణాలు

ఆన్ లైన్ లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. లోన్ తీసుకున్న వారి పాలిటి ఆన్ లైన్ లోన్ యాప్ లు యమపాశాలుగా మారుతున్నాయి. ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అప్పులు ఇచ్చి వాటిని వసూలు చేసేందుకు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు.

Online Loan Apps Harassment : తీసుకుంది రూ.2వేలు, కట్టింది రూ.15వేలు, అయినా న్యూడ్ ఫొటోలతో వేధింపులు.. లోన్ యాప్స్ దారుణాలు

Updated On : August 22, 2022 / 5:37 PM IST

Online Loan Apps Harassment : ఆన్ లైన్ లోన్ యాప్స్ నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. లోన్ తీసుకున్న వారి పాలిటి ఆన్ లైన్ లోన్ యాప్ లు యమపాశాలుగా మారుతున్నాయి. ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అప్పులు ఇచ్చి వాటిని వసూలు చేసేందుకు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. బాధితుల కాంటాక్ట్ లిస్ట్ ను యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో వాటి ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. అప్పు చెల్లించకపోతే ఫొటోలు మార్ఫింగ్ చేసి కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులకు పంపుతున్నారు.

HM Misbehaved With Girl Students : విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన హెడ్‌ మాస్టర్‌..చితక్కొట్టిన గ్రామస్తులు

తాజాగా ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ప్రకాశం జిల్లా కంభంకి చెందిన షేక్ సుబానీ ఆన్ లైన్ లోన్ యాప్ ద్వారా రూ.2వేల 250 అప్పు తీసుకున్నాడు. అసలు, వడ్డీల పేరుతో పలు దఫాల్లో రూ.15వేలు వసూలు చేశారు. అయినా వారి ధనదాహం తీరలేదు. ఇంకా చెల్లించాలంటూ వేధింపులు మొదలు పెట్టారు.

Loan Apps: లోన్ యాప్స్ ఉపయోగించి రూ.500 కోట్ల దోపిడీ.. చైనాకు తరలిస్తున్న ముఠా

అంతేకాదు సుభానీ ఫొటోని మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. వారి ఆగడాలు అంతటితో ఆగలేదు. సెక్స్ వీడియోలను సుభానీ బంధువులు, మిత్రులకు పంపి పరువు తీశారు. దీంతో బాధితుడు కుమలిపోయాడు. వ్యక్తిగత అవసరాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుంటే ఇదేం దారుణం అని కన్నీరు పెట్టుకున్నాడు బాధితుడు.

పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఆన్ లైన్ లోన్ యాప్స్ ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఆన్ లైన్ లోన్ యాప్స్ తో జాగ్రత్తగా ఉండాలని, లోన్ల కోసం వాటి జోలికి వెళ్లొద్దని పోలీసులు నెత్తీనోరు బాదుకుని హెచ్చరిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇంకా చాలా మంది రుణం కోసం ఆన్ లైన్ లోన్ యాప్స్ ను ఆశ్రయించి చిక్కుల్లో పడుతున్నారు. కోరి మరీ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. అవమానాలు, బెదిరింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.