Plane Crashed Power Lines : అమెరికాలో విమాన ప్రమాదం.. విద్యుత్‌ తీగలపై కుప్పకూలిన ఫ్లైట్

అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. మేరిలాండ్‌లో విద్యుత్‌ తీగలపై ఓ విమానం కుప్ప కూలిపోయింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Plane Crashed Power Lines : అమెరికాలో విమాన ప్రమాదం.. విద్యుత్‌ తీగలపై కుప్పకూలిన ఫ్లైట్

plane crashed power lines

plane crashed power lines : అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. మేరిలాండ్‌లో విద్యుత్‌ తీగలపై ఓ విమానం కుప్ప కూలిపోయింది. దీంతో మాంట్‌గొమెరీ కౌంటీలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు చిన్నపాటి విమానం మాంట్‌గొమెరీ కౌంటీకి విద్యుత్‌ సరఫరా చేసే తీగలపై కుప్ప కూలిపోయింది.

దీంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. ఈ కారణంగా మాంట్‌గొమెరీ కౌంటీ పట్టణంలోని 90 వేలకుపైగా నివాస, వాణిజ్య సముదాయాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. కౌంటీలోని పావు భాగం ప్రస్తుతం అంధకారంలో చిక్కుకుందని అధికారులు పేర్కొన్నారు.

IndiGo Aircraft: టేకాఫ్ సమయంలో ఇండిగో విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు

ఈ ప్రమాదం వల్ల ఎవరికీ ఎలాంటి హానీ జరుగలేదని వెల్లడించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. అయితే,  ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.