Police raid : బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ పై పోలీసుల దాడులు.. అదుపులోకి తీసుకున్న వారిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్

రాడిసన్ బ్లూ హోటల్ లో కొన్ని అనుమానాస్పద వస్తువులు, సిగరెట్ ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. ఫుడింగ్ ఇన్ మింగ్ పబ్ ను పోలీసులు సీజ్ చేశారు.

Police raid : బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ పై పోలీసుల దాడులు.. అదుపులోకి తీసుకున్న వారిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్

Police Raid

Banjara Hills Radisson Blu Hotel : హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారాహిల్స్ ర్యాడి సన్ బ్లూ హోటల్ పై వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. హోటల్ లో ఉన్న ఫుడింగ్ మింగ్ పబ్ సమయానికి మించి నడుపుతున్నట్లు గుర్తించారు. యజమానులు సహా సుమారు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారాహిల్స్ పీఎస్ కి తరలించారు.

రాత్రి3గం సమయంలో పోలీసులు దాడులు నిర్వహించారు. అదుపులోకి యువకులు హంగామా పోలీసు స్టేషన్ లో తమను ఎందుకు తీసుకు వచ్చారంటూ ఆందోళన చేశారు. పబ్ లో అదుపులోకి తీసుకున్న వారిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. రాహుల్ సిప్లిగంజ్ కు నోటీసులు ఇచ్చి పోలీసులు పంపిచేశారు. పబ్ లో పట్టుబడిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. నోటీసులు ఇచ్చి విడిచిపెడుతున్నారు.

Banjara Hills : బంజారాహిల్స్ లో మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం

రాడిసన్ బ్లూ హోటల్ లో కొన్ని అనుమానాస్పద వస్తువులు, సిగరెట్ ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. ఫుడింగ్ ఇన్ మింగ్ పబ్ ను పోలీసులు సీజ్ చేశారు. ఇది రేవ్ పార్టీ కాదని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. పబ్బు నిర్వాహకులు అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత కూడా పబ్బు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపారని పేర్కొన్నారు.