Chikoti Praveen : ఒక్కొక్కటిగా వెలుగులోకి క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు

క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈడీ రంగంలోకి దిగడంతో చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో చికోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహించినట్లుగా గుర్తించారు అధికారులు.

Chikoti Praveen : ఒక్కొక్కటిగా వెలుగులోకి క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు

Chikoti Praveen

Chikoti Praveen : క్యాసినో డాన్ చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాన్ని బయటపెడుతున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. విదేశాల్లో నిర్వహించిన క్యాసినో గేమ్స్ పై కూడా కూపీ లాగుతోంది మెల్లమెల్లగా. ఈడీ రంగంలోకి దిగడంతో చికోటి ప్రవీణ్ చీకటి బాగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏడు నెలల్లో ఏడు దేశాల్లో చికోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహించినట్లుగా గుర్తించారు అధికారులు.

Casino Chikoti Praveen : చికోటి ప్రవీణ్‌..అలియాస్‌ క్యాసినో ప్రవీణ్‌..ఇది పేరే కాదు ఇట్స్ ఏ బ్రాండ్

శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, థాయ్ ల్యాండ్ లో క్యాసినో నిర్వహించినట్లుగా అధికారులు తేల్చారు. ఇప్పటివరకు వెయ్యికి మందికిపైగా విదేశాలకు తీసుకెళ్లి వారితో చికోటి ప్రవీణ్ క్యాసినో ఆడించినట్లుగా సమాచారం వస్తోంది. ఈ వ్యవహారంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం. చికోటి ప్రవీణ్ అనుచరుడు, ఆరాధ్య ట్రావెల్స్ అధినేత సంపత్ పలువురిని విదేశాలకు తీసుకెళ్లి క్యాసినో ఆడేందుకు స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

దీంతో సంపత్ ఇంటి మీద కూడా అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్ అతడి అనుచరులు సంపత్, వెంకటేశ్, మాధవరెడ్డి, రాకేశ్, బబ్లూలకు నోటీసులు పంపింది ఈడీ. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Casinor Chikoti Praveen : గల్లీ నుంచి మొదలైన..క్యాసినో గాంబ్లర్ చికోటి ప్రవీణ్‌ ప్రస్థానం

అటు సీజ్ చేసిన చికోటీ ప్రవీణ్ ల్యాప్ ట్యాప్ అలాగే మొబైల్స్ లోని డేటాను కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. దాని నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. చికోటి ప్రవీణ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారందరిని సోమవారం విచారణకు పిలిచినట్లుగా సమాచారం అందుతోంది. అలాగే ప్రవీణ్ ల్యాప్ కావొచ్చు, అతడి మొబైల్స్ లోని డేటాను పూర్తిగా పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు.

చికోటీ ప్రవీణ్ అనుచరుడు సంపత్ క్యాసినో ఆడేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి, సంపత్ బ్యాకు అకౌంట్లలో భారీగా నగదు గుర్తించారు. అకౌంట్లలో నగదు లెక్కలు చెప్పాలంటూ వారికి ఈడీ నోటీసులు పంపింది. హైదరాబాద్‌లో 8 చోట్ల జరిపిన సోదాల్లో భారీగా నగదు గుర్తించారు. శ్రీలంకలో ఈ నెల 8 నుంచి 17 వరకు 2 సార్లు చికోటి ప్రవీణ్ క్యాసినో నిర్వహించిట్లు అధికారులు గుర్తించారు. పంటర్స్‌ను ఉదయం తీసుకెళ్లి సాయంత్రం హైదరాబాద్ తీసుకొచ్చాడు ప్రవీణ్. చికోటి ఫామ్ హౌస్ లోనూ ఈడీ అధికారులు సోదాలు చేశారు. సోమవారం పూర్తి వివరాలు తీసుకుని రావాలని చెప్పారు.