Nihang : సింఘు సరిహద్దు హత్య, మేమే చంపామన్న నిహంగాలు

పంజాబ్‌, హరియాణాలోని ప్రధాన వర్గంలోని తిరుగుబాటుదారులైన నిహంగాల పనేనని సంయుక్త కిసాన్‌ మోర్చా  ఆరోపించింది. తమ మత గ్రంథాన్ని అవమానపర్చాడని... అందుకే హత్య చేసినట్లు స్పష్టం చేశారు.

Nihang : సింఘు సరిహద్దు హత్య, మేమే చంపామన్న నిహంగాలు

Nihang

Updated On : October 16, 2021 / 1:31 PM IST

Singhu Border Murder Sikh detained : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న సింఘు సరిహద్దు హత్యకు సంబంధించి సర్వజిత్‌ సింగ్‌ అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. ఆ హత్య తానే చేశానని అంగీకరించాడు. అతడికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. 2021, అక్టోబర్ 16వ తేదీ శనివారం సర్వజిత్‌ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. నిందితుడిని నిర్ధారించేందుకు సోషల్‌ మీడియాలో వైరలవుతున్న వీడియోను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

Read More : Weather : జాగ్రత్త, రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఢిల్లీలోని సింధు సరిహద్దు వద్ద రైతులు నిరసన చేపట్టే వేదికకు సమీపంలో లాఖ్‌బీర్‌సింగ్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. వేదికకు సమీపంలో ఉన్న బారికేడ్‌కు అతడి మృతదేహం వేలాడుతున్న విషయాన్ని రైతులు గుర్తించారు. అతడి మణికట్టును కోసి దారుణంగా హత్య చేశారు. ఆందోళన చేస్తోన్న ప్రధాన వేదికకు సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో రైతుల్లో తీవ్ర కలవరం మొదలైంది.

Read More : Do not praise your children : పిల్లల్ని పొగడొద్దు..మన పెద్దలు ఎప్పుడోచెప్పారు,ఇప్పుడు సైంటిస్టులు చెబుతున్నారు..ఎందుకంటే

ఇది పంజాబ్‌, హరియాణాలోని ప్రధాన వర్గంలోని తిరుగుబాటుదారులైన నిహంగాల పనేనని సంయుక్త కిసాన్‌ మోర్చా  ఆరోపించింది. ఈ దారుణ ఘటనపై దర్యాప్తునకు పోలీసులకు సహకరిస్తామని ఎస్‌కేఎం వెల్లడించింది. సింఘు సరిహద్దుల్లో వ్యక్తిని చంపి వేలాడదీసింది తామే అంటూ నిహంగాల గ్రూప్‌ అంగీకరించింది. ఆ వ్యక్తి తమ మత గ్రంథాన్ని అవమానపర్చాడని… అందుకే హత్య చేసినట్లు స్పష్టం చేశారు.