Tamil Nadu Man: కువైట్‌లో దారుణం.. ఒంటెను చూసుకోలేదని తమిళనాడు వాసిని దారుణంగా చంపిన యజమాని

తమిళనాడు వాసి కువైట్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. యజమాని చెప్పినట్లుగా ఒంటెల సంరక్షణ బాధ్యత తీసుకోలేదని, తమిళనాడు వాసిని యజమాని హత్య చేశాడు. అత్యంత క్రూరంగా హింసించి చంపాడు.

Tamil Nadu Man: కువైట్‌లో దారుణం.. ఒంటెను చూసుకోలేదని తమిళనాడు వాసిని దారుణంగా చంపిన యజమాని

Updated On : September 15, 2022 / 3:10 PM IST

Tamil Nadu Man: కువైట్‌లో దారుణం జరిగింది. ఉపాధి నిమిత్తం అక్కడ పని చేస్తున్న తమిళనాడు వాసిని యజమాని అత్యంత క్రూరంగా హత్య చేశాడు. తన ఒంటెల సంరక్షణ బాధ్యత తీసుకోలేదని యజమాని ఈ దురాగతానికి తెగబడ్డాడు.

Udupi Roads: పాడైన రోడ్లను బాగు చేయాలంటూ రోడ్లపై గుంతలకు హారతి, పొర్లు దండాలతో నిరసన

తమిళనాడు, తిరువరూర్ జిల్లాకు చెందిన ముత్తు కుమార్ ఉపాధి నిమిత్తం ఈ నెల 3న కువైట్‌ వెళ్లాడు. అక్కడ సూపర్ మార్కెట్‌లో పని చేసేందుకు వెళ్లాడు. కానీ, అక్కడ యజమాని ఆ పని కాకుండా, ఒంటెలను సంరక్షించే పని చెప్పాడు. దీనికి ముత్తు కుమార్ నిరాకరించాడు. ఈ విషయంపై ముత్తు కుమార్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాడు. తర్వాత ముత్తు కుమార్ తను చెప్పిన పని చేయలేదని కోపం తెచ్చుకున్న అక్కడి యజమాని, ముత్తు కుమార్‌ను తీవ్రంగా హింసించి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి ఈ నెల 9న అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.

Andhrapradesh assembly session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. సభలో తీవ్ర గందరగోళం

దీంతో బాధిత కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. ముత్తు కుమార్‌ను హత్య చేసిన యజమానిపై చర్యలు తీసుకోవాలని, ముత్తు కుమార్‌ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావాలని కలెక్టర్‌ను కోరారు. ఉన్నతాధికారుల జోక్యంతో ఈ విషయంలో కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ స్పందించింది. ఈ అంశంలో చర్యలు తీసుకుంటామని, ముత్తు కుమార్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటించింది.