Telangana : ఐదేళ్ల క్రితం నరేశ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..

తెలంగాణలో 2017లో పెను సంచలనం సృష్టించిన అంబోజు నరేశ్ హత్య కేసులో సంచలన తీర్పు వెల్లడించింది భువనగిరి సెషన్స్ కోర్టు. సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, బంధువు నల్ల సత్తిరెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది భువనగిరి కోర్టు.

Telangana : ఐదేళ్ల క్రితం నరేశ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు..

bhuvanagiri court sensational verdict In 2017 naresh murder case

Telangana : తెలంగాణలో 2017లో పెను సంచలనం సృష్టించిన అంబోజు నరేశ్ హత్య కేసులో సంచలన తీర్పు వెల్లడించింది భువనగిరి సెషన్స్ కోర్టు. సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టేస్తున్నట్లు బుధవారం (జనవరి 2023) ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, బంధువు నల్ల సత్తిరెడ్డిలను నిర్దోషులుగా ప్రకటించింది భువనగిరి కోర్టు.

2017 మే నెలలో నరేష్‌ హత్యకు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. స్వాతి అనే యువతిని కులాంత వివాహం చేసుకున్న నరేశ్ ఘోరంగా హత్యకు గురి అయ్యాడు. స్వాతి తండ్రే ఈ హత్య చేయించాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు.ఆ తరువాత స్వాతి కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో వారి ప్రేమకథ విషాదంగా ముగిసింది. యాదాద్రి భువనగిరి ఆత్మకూరు మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేశ్ లింగరాజుపల్లెకు చెందిన స్వాతి కాలేజీలో ప్రేమించుకున్నారు.ఇద్దరి కులాలు వేరు కావటంతో స్వాతి ఇంట్లోవారు వివాహానికి అంగీకరించాలేదు. దీంతో నరేశ్ ముంబైలో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు స్వాతిని తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడు.ఈ విషయం తెలిసిన స్వాతి తండ్రి మీరిద్దరు భువనగిరి రండీ మరోసారి మీఇద్దరికి వివాహం జరిపిస్తానని నమ్మించాడు. తండ్రి మాటలు నమ్మిన స్వాతి భర్త నరేశ్ తో కలిసి తండ్రి ఇంటికి వచ్చింది. తరువాత నరేశ్ కనిపించకుండాపోయాదు. దీంతో నరేశ్ తల్లిదండ్రులు హైకోర్టులో కేసు దాఖలు చేశారు.కోర్టు నరేశ్ ఎక్కడున్నా కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.

దీంతో నరేశ్ కోసం గాలించగా హత్యకు గురి అయ్యాడని తేలింది. దీంతో స్వాతి తండ్రిని పోలీసులు విచారించగా నరేశ్ ను తానే చంపానని అంగీకరించాడు. తన బంధువుల సహాయంతో చంపానని ఒప్పుకున్నాడు. నరేశ్ చనిపోయాడని తెలిసిన స్వాతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో స్వాతి తండ్రి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, బంధువు నల్ల సత్తిరెడ్డిలను ఏ1, ఏ2లుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై భువనగిరి కోర్టులో విచారణ కొనసాగుతుండగా ఈ కేసులో నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవంటూ తాజాగా ఈ కేసును కొట్టేసింది కోర్టు. దీంతో సత్తిరెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డిల విడుదలకానున్నారు. ఇక తీర్పుపై నరేశ్‌ తండ్రి వెంకటయ్య అప్పీల్‌ చేయనున్నట్లు తెలిపారు. భువనగిరి కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్‌ చేస్తామని, న్యాయం జరిగేంత వరకు పోరాడతానని, తన పాతికేళ్ల కొడుకును కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తంచేశారు.