Telangana Police : జితేందర్ రెడ్డి పీఏకు తెలంగాణ పోలీసుల నోటీసులు

తమ నాయకుడు నివాసం నుంచి నలుగురు కిడ్నాప్ గురైనట్లు నాలుగు రోజుల క్రితం ఢిల్లీ సౌత్ అవెన్యూ పోలీసులకు జితేందర్ రెడ్డి పీఏ జితేందర్ రాజ్ ఫిర్యాదు చేశారు. అనుమానిత వ్యక్తులు కిడ్నాప్

Telangana Police  : జితేందర్ రెడ్డి పీఏకు తెలంగాణ పోలీసుల నోటీసులు

Srinivas Goud

BJP Leader Jithender Reddy PA : తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏకంగా మంత్రి హత్యకు కుట్ర పన్నడం సంచలనంగా మారింది. తెలంగాణ కేబినెట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై జరిగిన హత్య కుట్రను పోలీసులు చేధించిన సంగతి తెలిసిందే. కేసును నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఇందులో బీజేపీ నేత జితేందర్ రెడ్డిపై ఆరోపణలు రావడం సంచలనం సృష్టిస్తోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు అనేక కీలక మలుపులు తీసుకొంటోంది. తాజాగా జితేందర్ రెడ్డి పీఏ జితేందర్ రాజ్ కు తెలంగాణ పోలీసులు నోటీసులు పంపారు. కేసు విచారణకు హైదరాబాద్ కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Read More : TRS Minister : అందుకే శ్రీనివాస్ గౌడ్‌‌ని చంపాలనుకున్నా.. హత్యా ప్రయత్నం కేసులో సంచలనాలు

తమ నాయకుడు నివాసం నుంచి నలుగురు కిడ్నాప్ గురైనట్లు నాలుగు రోజుల క్రితం ఢిల్లీ సౌత్ అవెన్యూ పోలీసులకు జితేందర్ రెడ్డి పీఏ జితేందర్ రాజ్ ఫిర్యాదు చేశారు. అనుమానిత వ్యక్తులు కిడ్నాప్ అపహరణ పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు FIR నమోదు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాఖలైన కేసుకు సంబంధించి నలుగురిని తామే అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసులకు తెలంగాణ పోలీసులు తెలిపారు. కానీ నిబంధనలు పాటించకుండా ముందస్తు సమాచారం, అధికారిక సమాచారం ఇవ్వకుండా అదుపులోకి తీసుకోవడంపై ఢిల్లీ పోలీసులు అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. తెలంగాణ పోలీసులు అనుసరించిన తీరు విధానం సరైంది కాదంటూ ఢిల్లీ పోలీసు వర్గాలు ఓ లేఖ రాయనున్నట్లు సమాచారం.

Read More : Telangana : మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర.. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌‌లో కీలక విషయాలు.

నాలుగు రోజుల క్రితం సౌత్ అవెన్యూ 105 నుంచి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటనకు సంబంధించి ఆ లేఖలో పలు అంశాలను ప్రస్తావించనున్నారని తెలుస్తోంది. మరోవైపు…ఫిబ్రవరి 28న నలుగురిని తెలంగాణ పోలీసులు ఎత్తుకెళ్లడంపై స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారని సమాచారం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసును న్యాయ విచారణ లేదా సీబీఐతో దర్యాప్తు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అసలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు పూర్తిగా బోగస్ కేస్ అంటోంది.